📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Richest Village : ఖరీదైన గ్రామం హువాజీ గ్రామం (చైనా)

Author Icon By venkatesh
Updated: July 17, 2025 • 1:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Richest Village : పల్లెటూళ్లు ప్రకృతి అందాలకు పట్టుగొమ్మలని నానుడి. పచ్చని చెట్లు, ఇంట్లో కోళ్లు, మేకలు, గేదెలు, చిన్న చిన్న కాలువలు, పచ్చని పొలాలు, చెమటోడ్చి కష్టపడే రైతులు పగలంతా పొలంలో కష్టపడి రాత్రికి వెన్నెల్లో నిద్రపోతారు. పల్లెటూళ్లు అంటే ఇంచు మించు ఇలాగే ఉంటాయి. కానీ ఈ గ్రామం మెట్రో సిటీలను సైతం తలదన్నే రీతిలో ఉంటుంది.

హైటెక్ హంగులతో ఉండే విలాసవంతమైన ఇళ్లు, పెద్ద పెద్ద రోడ్లు, ఖరీదైన కార్లు, స్టార్ట్ సిటీలు కూడా ఈ గ్రామం కింద పనికిరావు. ఆ ఊళ్లో ఉండే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే. ప్రతి వ్యక్తి వార్షికాదాయం సుమారు ఎనభై లక్షల పైనే ఉంటుందట.

చైనాలో ఉన్న ఈ పాష్ పల్లెటూరి విశేషాలు… చైనాలోని జియాగ్యిన్ నగరానికి సమీపంలో హువాజీ(Huaxi) అనే గ్రామం ఉంది. ప్రపంచంలోనే ఇది ధనిక గ్రామం. ఇక్కడ నివసించే ప్రతి కుటుంబం నగరాల్లో నివసించే ధనవంతులతో సమానంగా సంపాదిస్తారట. హువాజీ గ్రామంలో ఉండే ప్రతి ఇల్లు ఎంతో విలాసవంతంగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి ఖరీదైన కార్లు ఉంటాయి. గ్రామం మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. పక్కా రోడ్లు ఉంటాయి. ఇదంతా ప్రత్యేక లోకంలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది.

వీరికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? వ్యవసాయం. వ్యవసాయంతో ఇంత లాభమా? అనిపిస్తుంది కదా. ఇక్కడున్న వారంతా వ్యవసాయం చేస్తారు. పంటల ద్వారానే భారీగా డబ్బు సంపాదిస్తారు. హువాజీ గ్రామస్తులు మాత్రం వ్యవసాయంతోనే కోటీశ్వరులయ్యారు.

ఒకప్పుడు ఈ గ్రామం ఎన్నో ఇబ్బందులు పడింది. 1961లో ఈ గ్రామం ఏర్పడింది. అప్పుడు ఇక్కడి ప్రజలు చాలా పేదవారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండేది. కానీ వ్యవసాయం పరిస్థితి అప్పట్లో చాలా అధ్వాన్నంగా ఉండేది.

ఆ తర్వాత గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ప్రెసిడెంట్ వురెన్వావో గ్రామం ముఖచిత్రాన్నే మార్చేశారు. వ్యవసాయంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఎవరి పంట వారు పండించకుండా అందరూ కలిసి ఉమ్మడి వ్యవసాయంతో చేశారు. ప్రతి రైతు తన భూమిలో సాగు చేయకుండా సమూహాలుగా ఏర్పడి సాగు చేయడం ప్రారంభించారు.

సామూహిక వ్యవసాయం వల్ల ఉత్పత్తి పెరిగింది. బాగా లాభాలు వచ్చాయి. తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. అందరూ కలిసి మెలిసి జీవిస్తూ కోటీశ్వరులయ్యారు.

ఇదంతా చూస్తూ తెలుగులో ఉమ్మడి వ్యవసాయంపై తీసిన సినిమా గుర్తుకొస్తోంది కదూ… అది సినిమా… కానీ ఇది జీవితం.(Richest Village)

richest place richest village richest village in china richest village in world

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.