Mutual Divorce: ఇప్పటికీ మేమిద్దరం ఒకరికొకరు కావాలనుకుంటున్నాం ఆమె స్వరం దృడంగా పలికింది. ఒక్కసారి అతని దవడ కండరం బిగుసుకుంది. మొహం జేగురు రంగులోకి మారింది. “పెళ్లి చూపుల్లో అరగంట పైగా మాట్లాడుకున్నాం. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక నెల రోజులు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నప్పుడు కూడా ఏమీ చెప్పని నీవు, పెళ్లి అయిన ఆరు మాసాలలో ఇలా చెప్పడంలో నీ ఉద్దేశం ఏమిటి?”
ఆమె ఎంతో నెమ్మదిగా “ సారీ, నాకు తెలుసు. ఇది ఎంతో బాధ కలిగిస్తుందని. కానీ ఏం చేయను. ఇంట్లో ససేమిరా అంగీకరించరు. నన్ను బంధిస్తారు. విషం తాగి చస్తామంటారు. బంధు, మిత్రులతో ఎంతో రాద్ధాంతం చేస్తారు. మా అక్క విషయంలో ఏం జరిగిందో నాకు తెలుసు. అక్క పెళ్లి బలవంతంగా చేశారు. తను రాజీ పడి జీవిస్తోంది. అలా నేను చేయలేను” చెప్పింది.
“అంటే ఇప్పుడు ఈ విషయం నీ నిర్ణయం తెలిస్తే నిన్ను బంధించరా? విషం తాగి చావరా? నీ ద్వంద్వ వైఖరికి నేనే దొరికానా? మా అమ్మా, నాన్న ఎంత కుంగిపోతారో నీకేం తెలుసు? పెళ్లి అంటే మరీ ఇంత తేలిక భావం ఉండటం నిజంగా దారుణం. మొదటిసారి నిన్ను చూసినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు నాకో చక్కని భాగస్వామి దొరికిందని ఎంత పొంగిపోయాను. నా భావి జీవితం నీతో నందనవనంలా ఉంటుందని ఎంత ఆశపడ్డానో నీకేం తెలుసు?” గొంతులో ఏదో అడ్డుపడినట్లు అవడంతో ఆగిపోయాడు.
“నన్ను క్షమించు. పెళ్లి చూపుల్లో ఓ అరగంట మాట్లాడినప్పుడు నాకో చక్కని భాగస్వామి దొరికిందని ఎంతో పొంగిపోయానన్నావు. అరగంట పరిచయంలో అది కరెక్టు కాదని తేలిపోయింది. నా స్నేహితునితో నా స్నేహం ఎన్నో యేళ్లు. కలిసి చదువుకున్నాం. ఒకరి గురించి ఒకరికి చాలా అవగాహన ఉంది. ఇక్కడ స్నేహం మా ప్రేమ కన్నా ఎక్కువ.
అంతా అనుకున్నట్లు జరుగుతాయి అని నమ్మకంతో వున్నప్పుడు సంఘటనలు ఒకదాని మీద ఒకటి విరుచుకుపడి మన పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు మన పెళ్లి బంధాన్ని మించిన మా ప్రేమ బంధాన్ని నీవు నీ విశాల హృదయంతో నన్ను కాపాడలేవా? నీ మంచితనానికి ఓ మంచి భాగస్వామి నీకు తప్పకుండా దొరకాలని నా ప్రార్థన.. నా వలన నీకు ఇంతటి మనస్తాపం కలగడం ఎంతో బాధగా ఉంది. నిజంగా ఇది తీరని ద్రోహమే. నన్ను అర్థం చేసుకో. నీ సహకారం నాకు ఎంతో అవసరం. నన్ను నీవే కాపాడాలి. తదుపరి కార్యాచరణ ఇరువురం సామరస్య ధోరణిలో చేద్దాం”.
ఆమె మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక అయోమయానికి గురయ్యాడు. పిచ్చివాడిలా కాలర్ల దగ్గరకు నడిచాడు. ఆమె అతని వెనకాలే నదిచింది. అతడు కారు డోర్ తీయబోతుంటే “మీరు కూర్చోండి. నేను డ్రైవ్ చేస్తాను” అంది.
Mutual Divorce: ఇద్దరూ ఆ ఫ్లాట్లో మరో ఆరు మాసాలు కలిసే వున్నారు. కాకపోతే అపరిచితుల్లా మెలిగారు. ఆమె చేతి వంట అతను తినలేదు. కనీసం కాఫీ అయినా. తాగలేదు. అవసరానికి మించి ఎవరూ ఒకరినొకరితో మాట్లాడలేదు.
ఇద్దరూ లాయర్ దగ్గరికి వెళ్లారు. విడాకులకి దరఖాస్తు చేశారు. ఈ వార్త వినగానే, అమ్మాయి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అబ్బాయి తల్లిదండ్రులూ అంతే, వెంటనే ఆఘమేఘాల మీద వచ్చేశారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.
కాళ్లా, వేళ్లా పడ్డారు. అరిచారు, చస్తామని బెదిరించారు. బంధు మిత్రులకు విషయం తెలియగానే విస్తృతంగా చర్చలు అబ్బాయి బాగా దెబ్బ తిన్నట్టు పక్కి శివప్రసాదరావు కనిపించసాగాడు. అమ్మాయి మామూలుగానే ఉంది.
రోజులు గడుస్తున్నాయి. ఏ విషయమైనా, విషాదమైనా కాలంతో పాటు ప్రభావాన్ని కోల్పోయి సాదా సీదా అయిపోతుంది. ఈ రోజుల్లో విడాకులు కామన్ అయిపోయాయి. సరిగ్గా ఓ సంవత్సరం తరువాత, అందరికీ ఇన్విటేషన్ కార్డులు వచ్చాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ లాగే ఉంది కానీ, అది ఫేర్ వెల్ కార్డ్, షామియానాలు, డెకరేషన్స్ అన్నీ మామూలే. కుతూహలంతో చాలా మందిని రప్పించిన కారణంగా అక్కడ అతిథులు చాలా మంది వచ్చారు. చక్కటి మ్యూజిక్ అందరికీ వినిపిస్తోంది. అమ్మాయి, అబ్బాయి వేదిక మీదకు వచ్చారు. ఓ పెద్దాయన మైక్ పట్టుకుని విడిపోతున్న దంపతులను అభినందిస్తూ, వాళ్ల కొత్త జీవితాలు బాగా సాగాలని ఆశిస్తూ ప్రసంగించాడు.
అమ్మాయి, అబ్బాయి వేదిక మీద చెరో వైపు నిలబడ్డారు. పెద్దాయన మైక్ అబ్బాయికి అందించాడు. “ఫ్రెండ్స్! మేమిద్దరం విడిపోతున్నాం. అందరికీ థాంక్స్” అన్నాడు. క్లుప్తంగా. అక్కడికి వచ్చిన వాళ్లలో చాలామంది బంధుమిత్రులు యుక్త వయసులో ఉన్నవాళ్లే. ఒకరో, ఇద్దరో పెద్దవారు కనిపిస్తున్నారు.
ఉభయుల తల్లిదండ్రులు అక్కడ లేరు. అమ్మాయి మైక్ అందుకుంది.
“మై డియర్ వెల్ విషర్స్, అనుకోకుండా కొన్ని జరిగిపోతుంటాయి. అలా జరిగిన వాటిని దిద్దుకోవడానికి అవకాశం వున్నప్పుడు దిద్దుకోవాలి. మేం చేసింది అదే.
అర్ధం చేసుకోండి. ఎంతో సామరస్యంగా ఇరువురం విడిపోతున్నాం. ఈ సందర్భంగా స్నేహపూర్వకంగా ఇచ్చే ఈ డిన్నర్ ని స్వీకరించగోరుతున్నాం” అంది.
ఆంగ్లంలో ఆమె ప్రసంగం రానున్న మార్పులకు కొత్త సంకేతంలా కనిపిస్తోంది.
Read also: Moral Story: ఎవరు తీసిన గోతిలో వాళ్లే..
Read also: Hindi Vaartha