📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

A Moral Lesson to the Fox:నక్కకు గుణపాఠం

Author Icon By Hema
Updated: July 24, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుందరవనం అనే అడవిలో జిత్తులమారి నక్క ఉండేది. అది అన్నీ పిల్లజంతువులను భయపెట్టేది. అది సింహానికి సలహాదారు. కనుక జంతువులు అది ఏం చేసినా సహించేవి. ఆ అడవిలోనే ఉన్న కోతి (monkey) సింహాన్ని ఎన్నోసార్లు ప్రమాదాల నుండి కాపాడింది. అందుకే సింహానికి అదంటే మిక్కిలి అభిమానం. ఈ సంగతి నక్కకు తెలియదు.

ఇలా ఉండగా ఒకసారి నక్క (fox) ఒక కొండ గొర్రెపిల్ల కనిపిస్తే – “ఓ కొండగొర్రె! అదిగో! ఒక తోడేలు ఇటే వేగంగా వస్తున్నది. అది నిన్ను తప్పక పట్టుకొని తింటుంది” అని భయపెట్టింది. ఆ కొండ గొర్రెపిల్ల భయంతో పారిపోతుంటే నక్క పగలబడి నవ్వింది. ఆ కొండగొర్రె వెళ్లి తన తల్లికి ఆ సంగతి చెప్పింది. మరికొన్ని రోజులకు ఆ నక్క ఒక కుందేలు పిల్లను చూసి – “అదిగో! కుందేలు పిల్లా! చిరుతపులి ఒకటి ఇటే వస్తున్నది. నీకు ఈ రోజే ఆఖరి రోజు” అని భయపెట్టింది. అది విన్న ఆ కుందేలు పిల్ల వెంటనే పారిపోతుంటే దాన్ని చూసిన నక్క బిగ్గరగా నవ్వసాగింది. ఆ కుందేలు పిల్ల కూడా ఈ విషయం తన తల్లికి చెప్పింది.

అక్కడ చెట్టు చాటున ఉన్న ఎలుగుబంటి ఇది గమనించి నక్కతో – “అలా చేయడం తగదు. చిన్నవాటిని భయపెట్టడం మానుకో” అని సలహా ఇచ్చింది. కానీ నక్క దాని మాటను పెడచెవిన పెట్టింది. జంతువులన్నీ కలిసి సింహానికి ప్రియమైన కోతి వద్దకు వెళ్లి నక్క తమ పిల్లలను భయపెడుతున్నదని చెప్పాయి. కోతి దానికి తగిన గుణపాఠం చెబుతానని వాటికి హామీ ఇచ్చింది.

ఒకసారి నక్కకు సింహం అభిమానించే కోతి ఎదురైంది. అది కోతిని కూడా భయపెట్టాలనుకొంది. దాంతో – “ఓ కోతి బావా! మనకు ప్రళయం వస్తోంది. నీకు తెలుసా! చెట్లపైన తిరిగే ప్రాణులేవి బ్రతకవట. నీకు చాలా ముప్పు ఉంది. సింహం అంటుంటే విన్నాను” అని అంది. అప్పుడు కోతి – “ఆ ప్రళయం సంగతి తర్వాత.

చిన్నజంతువులకు భయం కలిగించిన నక్కకు శిక్ష:

ముందు నీకు ప్రమాదం వస్తోంది. నా వెనుక పక్క అడవికి చెందిన ఒక పెద్ద పులి పరిగెత్తుతూ వస్తున్నది. నేను దాని నుండి తప్పిచుకుని వస్తున్నాను. నాకు చెట్టెక్కడం వచ్చు. నీకేమో రాదు. దాని చేతిలో నీవు చావక తప్పదు” అంటూ, “అమ్మో పులి!” అని చెట్టెక్కింది. వెంటనే నక్క వెనక్కి తిరిగి చూడకుండా భయంతో ఒకే పరుగు తీసి ఒక చెట్టు పొదలలో దాక్కుంది. అది ఎంత సేపు ఎదురు చూసినా పులి మాత్రం రాలేదు.

అప్పుడు నక్క బయటకు వచ్చి అక్కడ చెట్టుపైన ఉన్న కోతితో – “పులి ఏది? నన్ను అనవసరంగా భయపెట్టావు” అని అంది. అప్పుడు కోతి – “పులి లేదు, గిలి లేదు. నీవు పిల్ల జంతువులను భయపెడుతున్నావని తెలిసింది. నీకు ఆ భయం ఎలా ఉంటుందో తెలియజేయాలని అలా చేశాను” అని అంది. అప్పుడు నక్క – “నేను సింహానికి నీ సంగతి చెబుతాను” అని అంది. అప్పుడే అక్కడకు వచ్చిన ఎలుగుబంటి ఇది విని – “ఈ కోతి ఎవరనుకున్నావు. సింహానికి అత్యంత ప్రియమైంది. సింహం దాని మాటనే వింటుంది” అని అంది. ఆ మాట విన్న నక్క భయపడి వెంటనే మరో అడవికి పరుగు తీసింది. దానికి గుణపాఠం చెప్పినందుకు ఎలుగుబంటితో పాటు మిగతా జంతువులు కోతిని అభినందించాయి.

Read also: hindi.vaartha.com

Read also: The Crow’s Evil Plan:కాకి దురాలోచన

Fox Story kids stories Telugu Kathalu telugu moral stories

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.