📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu Moral Stories: కుందేలు నేస్తం

Author Icon By Madhavi
Updated: July 8, 2025 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telugu Moral Stories: వేసవి సెలవుల్లో గోపాలం కూతురు లత కోసం కథల పుస్తకం తెచ్చాడు. పుస్తకం అట్టమీద తెల్లకుందేలు ముఖచిత్రం చాలా అందంగా, ముద్దుగా ఉంది. పాప కుందేలు చిత్రాన్ని చాలాసేపు చూసింది.

“నాన్నా! కుందేలు ఎంత ముద్దుగా ఉందో చూడు.

నాకు ఆడుకోవానికి ఒక కుందేలు తీసుకురావా!

మనం పెంచుకుందాం’ అంది.

‘సరే’ అన్నాడు గోపాలం.”

ఒకచోట ఒకడు కుందేళ్లను అమ్ముతూ కనిపిస్తే ఒక కుందేలును తీసుకొచ్చాడు గోపాలం. ‘మా మంచి నాన్న’ అని మురిసిపోయింది లత. పదిరోజుల్లోనే కుందేలుకు, పాపకు మంచి స్నేహం ఏర్పడింది. కలిసిమెలసి ఆడుకుంటూ, పరుగులుపెడుతూ, ఆనందంగా ఉండటం చూసి లత అమ్మా, నాన్న సంతోషించారు..

ఒకరోజు ఉదయం లత తల్లిదండ్రులు పనిమీద పొరుగునున్న పట్నానికి వెళ్తూ ‘మధ్యాహ్నం భోజనం సమయానికి తిరిగివస్తాం. వేసవికాం ఎండలకు నువ్వు మావెంట ఎందుకులే అని చెప్పి వెళ్లారు. లత, కుందేలు పరుగులు పెడుతూ ఆడుకుంటుండగా కుందేలు ఇంట్లో నుండి బయటకు పరుగెత్తింది. లత వెంబడించింది.

ఊరి బయటకు వెళ్లాక కుందేలు ఒక తోట కనిపిస్తే అందులోకి దూకింది. పాప కూడా తోటలోనికెళ్లింది. కుందేలు కనిపించలేదు. పాప వెదుకుతూ వెడుతోంది. అక్కడ ఒక చిన్న గుడిసె ముందు ఒక మనిషి కనిపించాడు. ఆ తోట ఒక భూస్వామిది. ఆ మనిషి తోట కాపలాదారు. ఇటువైపు నా కుందేలు వచ్చింది. చూశావా?’ అని అడిగింది. పాప, ‘చూడలేదుపాపా! తోటలోపల ఎక్కడ తిరుగుతోం ది! వెదుకు కనిపిస్తుంది. ఏ చెట్లజోలికి వెళ్లకు’ అన్నాడు. వెదుకుతూ ‘చంటీ..చంటీ అని పిలుస్తూ పరుగులు తీస్తూ లోనికెళ్లింది. ఒక చిలుక ఎగురుతూ వచ్చి పాస భుజంపై వాలింది.

‘ఎవరిని పాపా పిలుస్తూ వెదకుతున్నావు? కుందేలు కోసమేనా?’ అని అడిగింది. ‘చిలకమ్మా! కుందేలు నా నేస్తం. ఈతోటలోకి వచ్చి తప్పిపోయింది. నువ్వు చూశావా? అంది పాప. నేను చూశాను. నీ కుందేలు పరుగెడుతూ వచ్చి, తోటమాలి గుడిసెలోనికి వెళ్లింది. అది చూసి తోటమాలి గుడిసె. తలుపు వేసి, గొళ్లెం పెట్టాడు’ చెప్పింది చిలుక. ‘మరి నేను అడిగితే చూడలేదన్నాడు.నా కుందేలును దాచి ఏం చేసుకుంటాడు? అడుకోవడానికి పిల్లవాడు. కాదుకదా?’ అడిగింది పాప. “పిచ్చితల్లీ! కుందేలును రాత్రి ఇంటికెళ్లేటప్పుడు తీసుకెళ్లి, చంపి కూరవండుకుని తింటాడు’ చెప్పింది. చిలుక. పాప ఆశ్చర్యపోయింది.

చిలుకా, పాప ఇద్దరూ కుందేలును ఎలా తప్పించాలా అని ఆలోచించాయి. పాపకు ఒక ఆలోచన వచ్చింది. చిలుకకు చెప్పింది. ‘భలే భలే’ అంది చిలుక. గుడిసెకు దారి చూపింది. చిలుక, గుడిసె దగ్గర తోటమాలి ఉన్నాడు.

‘కుందేలు కనిపించలేదా?’ అన్నాడు.

‘ఇంత తోటలో ఎక్కడ ఉందో కనిపించలేదు. నాకాళ్లు నొప్పెడుతున్నాయి. ఇంటికెళ్తున్నా అంది పాప..

‘అలాగే వెళ్లు’ అన్నాడు..

‘నన్నేమో ఏ చెట్టు జోలికి వెళ్లొద్దన్నావు. మరి తోటకు అటువైపు కోతులు పండ్లను తింటూ, ఆకులు పీకేస్తూ గెంతులేస్తున్నాయి?’ అంది పాప. వెంటనే తోటమాలి పక్కనున్న కర్ర తీసుకుని కేకలేస్తూ, కోతులను తరమడానికి పరుగెత్తాడు. చెట్టుమీద దాక్కున్న చిలుక పాప దగ్గతొచ్చింది.

‘తోటమాలిని భలే బోల్తా కొట్టించావ్!” అంది. పాప చిలుక సాయంతో తలుపు గొళ్లెం తీసి లోని కెళ్ళింది. గుడిసెలోపల దిగులుగా కూర్చుని ఉన్న కుందేలు పాపను చూసి సంతోషంతో గెంతులు వేసింది. పాప కుందేలును తీసుకుని చిలుక దారి చూపుతుండగా తోట బయటకొచ్చింది. చిలుక లతకు, కుందేలుకు వీడ్కోలు చెప్పింది. లత కుందేలుతో ఇల్లు చేరింది. అప్పటికే అమ్మా, నాన్న వచ్చి ఉన్నారు. పాప, కుందేలు కనిపించకపోయే సరికి కంగారుగా చుట్టుపక్కల వెదుకుతు న్నారు. పాప కనిపించగానే సంతోషించారు. జరిగిన సంగతులు చెప్పింది లత. పాప తెలివికి మురిసిపో యారు. ఎప్పుడూ ఇలా ఇల్లుదాటి, ఊరుదాటి వెళ్లవద్దని పాపకూ, కుందేలూ చెప్పారు.

Read also: Hindhu Mythology: భరతుడి ఉదంతం

#AnimalFriendship #KidsStory #MoralValues #RabbitStory #TeluguMoralStories Breaking News in Telugu Latest News in Telugu Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.