చిన్న వయస్సులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల కాలంలో చిన్నారులు సైతం గుండెపోటుకు(Heart Attacks) గురై ప్రాణాలు వదులుతున్నారు. 5వ తరగతి విద్యార్థి తరగతి గదిలోనే ప్రాణాలు విడిచిన ఘటనలు ఉన్నాయి. గతంలో 55 సంవత్సరాలు దాటిన వారిలోనే కొంతవరకు ఈ ముప్పు ఉండేది, యువతతో పాటు పిల్లలకూ ఈ ముప్పు పెరిగిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
మారుతున్న జీవనశైలి కారణాల విశ్లేషణ
మారుతున్న కాలానికి అనుగుణంగా మానవుల జీవన స్థితి గతుల్లో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. శరీరానికి శ్రమ, వ్యాయామం కలిగించే పనులు దాదాపుగా తగ్గిపోయాయి. ప్రైవేటు పాఠశాలల ప్రభావం ఎక్కువైన తరువాత ఆట మైదానాలు కూడా లేకుండా పోయాయి. అప్పట్లో ఉదయాన్నే నడుచుకుంటూనో, పాఠశాల సమయం సమీపిస్తుందన్న భయంతో పరుగులాంటి నడకతో స్కూళ్లకు వెళ్లేవారు.
గతం లో ఆరోగ్యవంతమైన పద్ధతులు
ప్రార్థన సమయం పేరుతో ఉదయాన్నే మైదానంలో నిలబెట్టి చిన్నపాటి వ్యాయామం అందించేవారు. ఆ తరువాత ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే భోజన సమయంలో ఆరగించేవారు. సాయంత్రం స్పోర్ట్స్ కు సంబంధించిన తరగతులు ఉండేవి. అంతేకాకుండా మొత్తం విద్యార్థులను మైదానంలోకి తీసుకువచ్చి సామూహికంగా వ్యాయామం చేయించేవారు. దీనితో విద్యార్థి దశ నుంచే శరీరంలో పటుత్వం పెరిగేది.
ప్రస్తుత కాలంలో శారీరక చురుకుదనం లేకపోవడం
ప్రస్తుతం ఇంటి నుంచి స్కూలుకు ఆటోలు, కార్లు ఉన్నాయి. అవి లేనివారు వారి తల్లిదండ్రులు స్కూటర్లపై పాఠశాల గుమ్మం వరకు దిగబెడుతున్నారు. మళ్లీ ఇంటికి వచ్చే సమయంలో కూడా ఇదే సౌకర్యం కొనసాగుతోంది. దీనితో పది అడుగులు కూడా వేయాల్సిన అవసరం చిన్నారులకు ఉండటం లేదు.
ట్యూషన్లు, హోంవర్క్‌తో సమయం మొత్తం పుస్తకాలకే
ఇంటికి వచ్చిన తరువాత ట్యూషన్లు, హోంవర్క్ ల పేరుతో రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తకాలతో యుద్ధం కొనసాగుతోంది. ఈ విధమైన జీనవశైలిలో శరీరానికి ఏమాత్రం వ్యాయామం ఉండటం లేదు. ఇదే పరిస్థితి యువతలోనూ కనిపిస్తోంది.
ఆహారపు అలవాట్ల మార్పు మరియు సెల్ఫోన్ల ప్రభావం
అదే విధంగా ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. బయట తిండికి బాగా అలవాటు పడ్డారు. దీనికితోడు జంక్ ఫుడ్స్ ఎక్కువ అయ్యాయి. చిన్న పిల్లల నుంచే తినే సమయంలో సెల్ఫోన్ అలవాటు చేశారు. ఫోన్లో వీడియోలు చూస్తుంటే ఆ సమయం లో తల్లిదండ్రులు పిల్లలకు భోజనం పెట్టే కార్యక్రమం పూర్తి చేస్తున్నారు.
తినే అలవాట్లపై దృష్టి కోల్పోతున్నారు
దీనితో పిల్లలు తాము ఎంత తింటున్నామన్న దృష్టిని కోల్పోతున్నారు, దీనివల్ల ఊబకాయం సమస్య అదనంగా తోడు అవుతోంది. ప్రాథమిక పాఠశాల నుంచి పిల్లలకు ప్రత్యేకంగా ఫోన్లను కొని ఇచ్చేస్తున్నారు. రాత్రి పదకొండు గంటల వరకు ఫోన్లు చూస్తూ కాలం గడుపుతున్నారు.
ఆరోగ్య సమస్యలపై అధ్యయనాల నివేదిక
ఇటీవల కాలంలో అధిక బరువు ఉన్న విద్యార్థులపై కొన్ని సంస్థలు అధ్యయనం చేశాయి. వారిపై వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా వారి జీవనశైలిని నిశితంగా పరిశీలించారు. దీనితో సుమారు 85 శాతం మంది విద్యార్థులు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.
వైద్య పరీక్షల్లో గుండెపోటుకు గల సూచనలు
ఎక్కువ మంది విద్యార్థులకు అధిర రక్తపోటు (హైబీపీ)(HighBP), హై కొలస్టరాల్(high cholesterol), షుగర్(Sugar) ఉన్నాయని తేలింది. చాలా మందిలో ట్రైగ్లిజరైడ్స్ అధిక మోతాడులో ఉన్నాయి. అంటే రక్తంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉందని వెల్లడైంది. మరికొందరిలో హోమో సిస్టైన్, లిపో ప్రోటీన్లు ఎక్కువ మోతాదులో ఉన్నాయి.
హోమో సిస్టైన్, లిపో ప్రోటీన్ల వివరణ
హోమో సిస్టైన్ అనేది రక్తంలో ఉండే అమైనో యాసిడ్. కొవ్వులను లిపిడ్స్ అంటారు. కొవ్వులను రక్త ప్రవాహం ద్వారా రవాణా చేసే అణువులను లిపో ప్రోటీన్స్ అంటారు. ఇలాంటి విద్యార్థులకు గుండెపోటు ముప్పు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
జీవితశైలిలో మార్పుల అవసరం
పిల్లల్లో జీవనశైలిని మార్చడంతో పాటు వారి ఆహారపు అలవాట్లలో సైతం కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వైద్యుల బృందం నిర్ణయించించింది. ముఖ్యంగా అన్ని అనర్థాలకు మూలమైన స్మార్ట్ ఫోన్లు (smart phones) వారికి అందుబాటులో లేకుండా చూడాలి. జంక్ ఫుడ్స్ ను పూర్తిగా నివారించాలి.
వ్యాయామాన్ని ప్రోత్సహించాలి
ఉదయం, సాయంత్రం వేళల్లో వారిని కనీసం రెండు నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి, స్మార్ట్ ఫోన్లు, టివిలు, కొంత సమయానికి మాత్రమే పరిమితం చేయాలి.
తల్లిదండ్రుల ఆచరణకు పిల్లల్లో మార్పు
పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు కూడా తమ ఫోన్లను పక్కన పెట్టాలి. పిల్లల రోజువారీ శారీరక యాక్టివిటీ క్రమంగా పెంచుకుంటూ రావాలి, స్కూలులో తరగతి గదికి, ఇంట్లో సెల్ఫోను అతుక్కుపోయి పిల్లలు గదిపే విధానానికి స్వస్తి పలకాలి.
స్పోర్ట్స్, ఇంటి పనుల్లో భాగస్వామ్యం
రోజూ కొంత సమయాన్ని గేమ్స్క్కు కేటాయించే స్కూళ్లలో పిల్లలను చేర్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంటికి సంబంధించిన తేలికపాటి పనుల్లోనూ పిల్లలను భాగం చేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. జంక్ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్కు దూరం చేయాలి.
ఫోన్లకు బదులుగా యాక్టివిటీ ప్రోత్సాహం
పిల్లలు స్మార్ట్ఫోన్లో గడిపే సమయాన్ని క్రమంగా తగ్గించి డ్యాన్స్(Dance), స్పోర్ట్స్)(sports) వంటి ఇతర యాక్టివిటీల్లో గడిపేలా ప్రోత్సహించాలి. అదేవిధంగా పిల్లల నుంచి యువత వరకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించు కోవాలి.
క్రమంగా హెల్త్ చెకప్‌లు అవసరం
ముఖ్యంగా కొలస్ట్రాల్, గుండె పనితీరు కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. చిన్న వయస్సులోనే చాలా మందికి షుగర్ సమస్య ఉంటోంది. రక్తకణాల పనితీరుకు సంబంధించిన పరీక్షలు కూడా రెగ్యులర్గా చేయించుకోవాలి.
ముందస్తు జాగ్రత్తలతో గుండెపోటు నివారణ
ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెపోటు(Heart Attacks) సమస్యను ఎదుర్కొనే అవకాశం.
గుండెపోటు ఎందుకు వస్తుంది?
ఆధునిక జీవనశైలిని నడిపించే యువత గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చెడు ఆహార ఎంపికలు : ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు చక్కెర పానీయాలు అన్నీ చాలా సాధారణం, ఊబకాయం, కొలెస్ట్రాల్ మరియు ఇతర హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి
పిల్లలకు గుండెపోటు వస్తుందా?
పల్మనరీ ఆర్టరీ నుండి వచ్చే అనామలస్ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ (ALCAPA) అని పిలువబడే ఈ పరిస్థితి, ప్రతి 300,000 జననాలలో 1 లో సంభవిస్తుంది. ఇది పిల్లలలో గుండెపోటుకు అత్యంత సాధారణ కారణం . “గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు, దీని వలన శిశువుకు హార్ట్ ఇస్కీమియా వచ్చే ప్రమాదం ఉంది.
పిల్లలకు గుండె సమస్యలు ఉంటే ఎలా తెలుసుకోవాలి?
వ్యాయామం లేదా కార్యకలాపాల సమయంలో సులభంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సులభంగా అలసిపోవడం లేదా మూర్ఛపోవడం వంటివి ఉంటాయి
పిల్లలకు ఒత్తిడి వల్ల గుండెపోటు వస్తుందా?
చిన్న వయసులోనే ఒత్తిడి పెరగడం వల్ల యుక్తవయస్సులో కార్డియోమెటబోలిక్ వ్యాధులు వస్తాయని పరిశోధకులు నివేదిస్తున్నారు.
Read Hindi News: hindi.vaartha.com
Read Also: Heart attacks: యుక్తప్రాయంలోనే ప్రాణాలు తీస్తున్న గుండెపోటు