సమయాన్ని సరదాగా మార్చే నవ్వుల జోక్స్ (funny jokes) కలెక్షన్. కొత్త కొత్త హాస్య చినుకులు, కుటుంబంతోనూ స్నేహితులతోనూ పంచుకోవడానికి సరైన జోక్స్.”
funny jokes: రోజూ పనులు, ఒత్తిడిలో మనం బిజీగా ఉంటాం. అలా ఉండే మనసుకు హాస్యమే ఓ మంచి ఔషధం. ఈ చిన్న చిన్న జోక్స్ చదవగానే నోరంతా నవ్వుతో నిండిపోతుంది. చదవండి… కొంచెం రిలాక్స్ అవండి!
వంటలు రుచిగా లేవు!
గృహిణి: ప్రతిరోజూ ఇక్కడికే వచ్చి అడుక్కుంటావు, ఎందుకని?
యాచకుడు: పక్క వీధిలో వాళ్లు చేసే వంటలు ఏమీ బాగుండవమ్మా!
బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి
పేరయ్య: స్వామిగారూ, మీ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి.
స్వామి: మా అబ్బాయిని అడగండి.
పేరయ్య: బాబుగారూ! మీరు చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో?
రవి: బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిని చూడండి!
గాడిద ఆలోచన
గాడిద: కుక్కబావా, నాకు మా యజమానికి పడటం లేదు… ఏం చెయ్యాలో తెలియటం లేదు.
కుక్క: ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు కదా?
గాడిద: మా యజమానికి ఒక కూతురు ఉంది. ఆమె సరిగ్గా చదవకపోతే… గాడిదకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు! అందుకే ఆలోచిస్తున్నాను!
తాళం చెవి అడిగాను
దొంగ 1: నువ్వు ఎలా దొరికిపోయావు?
దొంగ 2: ఇంటివాళ్లని నిద్ర లేపి… “బీరువా తాళం ఎక్కడ ఉంది?” అని అడిగానురా!
తప్పంతా నాదే!
అప్పారావు: ఈ మధ్య నువ్వు, మీ ఆవిడ గొడవ పడుతున్నట్లు లేదు… చాలా సంతోషంగా ఉందిరా!
సుబ్బారావు: మా ఆవిడ తప్పు చేసినా, నేను తప్పు చేసినా… తప్పు నా మీదే వేసుకుంటున్నాను!
జీతం ఇవ్వాల్సి వస్తుంది
భర్త: మా అమ్మను మా తమ్ముడి దగ్గరకు పంపిస్తాను… మనకు కాస్త ఖర్చు తగ్గుతుంది.
భార్య: అలా అయితే ఖర్చు ఇంకా పెరుగుతుంది! ఎందుకంటే, మీ అమ్మను మరిది ఇంటికి పంపితే… మనం పనిమనిషిని పెట్టుకుని జీతం ఇవ్వాల్సి వస్తుంది!
వశీకరణం
శంకరం: వశీకరణం చేసి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా! ఇప్పుడెలా ఉంది జీవితం?
గోపాలం: ఆమెను ఎలా వదిలించుకోవాలో తెలియటం లేదురా!
మెంటల్ హాస్పిటల్ గుర్తు
వాడు: మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు… కానీ ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు!
స్త్రీ: నాకు బాగా గుర్తుంది… నేను మెంటల్ హాస్పిటల్లో నర్సును!
నేను చూసుకుంటాను..
యాచకుడు 1: ఒరే రమణా! బ్యాంక్ వీధి అమ్మగారు ఎస్‌ఎమ్‌ఎస్ పంపారు. వాళ్లింట్లో రాత్రి అన్నం ఉంది అంటారు!
యాచకుడు 2: ఈ సారి నువ్వెళ్లు… ఈరోజంతా వీధిని నేను చూసుకుంటాను!
పని చేయడం లేదు
వినయ్: ఈ మధ్య ఒక్క సెలవు పెట్టకుండా డ్యూటీకి వస్తున్నావు, కారణమేంటో?
కిషన్: మా ఇంట్లో ఏసీ పని చేయడం లేదురా!
మీ అబ్బాయికి వచ్చేది కదా…
అత్త: పెళ్లికి ముందు నీకు వంట రాదని అబద్ధం ఎందుకు చెప్పావు?
కోడలు: నువ్వు పెళ్లి చేసుకోబోయే అతనికి వంట బాగా వచ్చునని పేరయ్య అన్నాడు… అందుకే!
Read Also: Funny jokes: సరదాగా కాసేపు నవ్వుకోండి