📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Everyone is Good : అందరూ మంచివారే 

Author Icon By Abhinav
Updated: December 9, 2025 • 1:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రామాపురం గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. ఎవరు ఏది అడిగినా వాళ్లు దనేవారు కాదు. దానం చేసి చేసి వారు పేదవారయ్యారు. తమ కొడుకు ఉన్నత చదువుల కోసం తమకు మిగిలిన ఒకే ఒక్క ఎకరం పొలం అమ్మి ఆ డబ్బును తమ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆ రాత్రి వారు పాయసం చేసుకొని తాగారు. మిగిలిన పాయసం అలాగే ఉంచి వారు. నిద్రపోయారు. వారి దురదృష్టంకొద్దీ ఆ రాత్రి ఒక దొంగ వారి ఇంట్లో ప్రవేశించి తమ కొడుకు కోసం దాచుకున్న డబ్బును తీసుకొని, ఆకలితో ఉన్నం దున పాయసం తాగి పరారయ్యాడు. తెల్లవారి లేచి చూసి జరిగినదానికి రామయ్య, సీతమ్మ ఎంతో బాధపడ్డారు. ఇలా ఉండగా ఆ పాయసాన్ని తాగి డబ్బులతో పరారైన దొంగ వాంతులు చేసుకుని ఊరి బయట ఒక చెట్టుకింద స్పృహ తప్పి పడిపోయాడు. గ్రామస్తులు ఎవరో ఉదయాన్నే అతనిని గమనించి ఆ సంగతి గ్రామపెద్దకు చేరవేశారు. 

గ్రామపెద్ద తన మనుషులను పంపి వాడిని పట్టి బంధించి తెమ్మన్నాడు. వారు అలాగే చేశారు. ఇంతలో ఎవరో ఒకరు “అవి రామయ్య ఇంట్లోనే వాటిని దొంగిలించాడన్న సమాచారం ఆ గ్రామ పెద్దకు తెలిపారు. వెంటనే గ్రామపెద్ద రామయ్య ఇంటికి తన మనిషిని పంపించి వారిని పిలిపించాడు. రామయ్య, సీతమ్మ దంపతులు గ్రామపెద్ద వద్దకు వెళ్లి ఆ మూటను చూసి,అది తమ డబ్బుల మూటనేనని, ఆ రాత్రే ఆ దొంగతం జరిగిందని తెలిపారు.

గ్రామపెద్ద సూచనతో వైద్యుడు చేసిన చికిత్స వల్ల దొంగ స్పృహలోకి వచ్చి తాను పాయసం తాగినందుకే అలా పడిపోయానని చెప్పాడు. వెంటనే గ్రామపెద్ద ఆ పాయసం గిన్నెను పట్టుకుని రమ్మని తన మనుషులకు చెప్పాడు. వారు తిరిగి రామయ్యతో పాటు అతని ఇంటికి వెళ్లి ఆ పాయసం గిన్నెను పట్టుకుని వచ్చారు. 

అందులో ఒక బల్లి చచ్చిపడి ఉండటం చూసి గ్రామ పెద్ద జరిగిన  విషయం గ్రహించాడు. ఆ చీకట్లో దొంగ దాన్ని చూప లేదని గ్రామపెద్ద నిర్ధారణకు వచ్చాడు. కావల్సిందేముంది?” అని అన్నాడు. గ్రామపెద్ద రామయ్య, సీతమ్మ డబ్బులు వారికి ఇచ్చి, కోలుకున్న దొంగను గట్టిగా మందలించాడు. ఆ తర్వాత గ్రామపెద్ద సీతమ్మ దంపతులతో “మీరు ఇతరులకు ఉపకారం చేసారు. అందుకే ఈ గజదొంగ

దొరికాడు. మీ సొమ్ము కూడా దొరికింది.. మీరు పాయసం తాగినప్పుడు లేని బల్లి తర్వాత పాయు సంలో పడడమేంటి? అది ఈ దొంగ తాగడమేంటి? అ ఆ పాయనమే ఈ దొంగను దొరికేటట్లు చేసింది” అని అన్నాడు. అప్పుడు రామయ్య భార్య “నిన్న రాత్రి హడావుడిలో మేం తాగిన పాయసం పైన మూత పెట్టడం మర్చి పోయాం. ఆ చీకట్లో బల్లి పడిన సంగతి మాకు తెలియదు. ఇతడు కూడా గమనించలేదు కాబోలు” అని అంది. 

వెంటనే రామయ్య కూడా “అయ్యో! పాపం.. దొంగకు ఏమీ కాలేదు కదా! ఇతని ఆరోగ్యం కుదుటపడింది గదా! అతని ప్రవర్తనలో మార్పు వస్తే మాకు అంతకన్నా వారి మంచి మాటలు విన్న దొంగ కన్నీరు కారుస్తూ “అయ్యా! మీకు అపకారం చేసిన నేను బాగుండాలని మీరు కోరుకుంటున్నారు అంటే మీ మంచితనం తెలుస్తోంది. ఈ గ్రామ పెద్ద కూడా నాకు వైద్యం చేయించి నన్ను కాపాడారంటే ఆయన మంచితనం తెలుస్తోంది. మీరందరూ మంచివారే. మీ మంచితనమే నా కళ్లు తెరిపించింది. ఇకనుండి నేను దొంగతనం చేయను. నా పిల్లల మీద ఒట్టు. కూలిపని చేసుకుని మీలాగే నేనూ పేదలకు సహాయపడుతూ బతుకుతాను” అని అన్నాడు. అతనిలోని మార్పుకు గ్రామపెద్దతో పాటు రామయ్య, సీతమ్మ కూడా ఎంతో సంతోషించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

changing hearts Forgiveness generosity good deeds Helping Others Honesty Humanity karma Kindness moral story thief transformation Village Life

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.