📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Digital crime on the rise : పెరుగుతున్న డిజిటల్ నేరాలు

Author Icon By Abhinav
Updated: December 4, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. క్షణాల్లో లక్షలాది, కోట్లాది రూపాయలను ‘పొగోట్టుకుని, సైబర్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నవారెందరో ఉన్నారు. సమాజంలో సాంకేతికతకు తోడ్పాటు అందుతున్న కొద్దీ, సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి. దీనిలో ముఖ్యంగా వృద్ధులు, డిజిటల్ పరిజ్ఞానంలో వెనుకబడి ఉన్న కారణంగా, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. దేశంలో ప్రతిరోజూ వేలాది మంది వృద్ధులు తమ సేవింగ్స్, వ్యక్తిగత సమాచారం కోల్పోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘డిజిటల్ అరెస్టులు’ అనే పదాన్ని ఖండించారు. అయితే, వాస్తవానికి, ఈ ప్రకటన మరింత అవగాహన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సైబర్ నేరగాళ్లు తమ నకిలీ పద్ధతుల ద్వారా వృద్ధులను మోసం చేస్తున్నారు. 

వీటిని డిజిటల్ అరెస్టులు అని భావించడం కంటే, ఇక్కడ అవగాహన లోపమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాల వల్ల నష్టపోయిన సొమ్ము భారత దేశంలో నష్టాలు: ఇండియాలో సైబర్ నేరాల వల్ల ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయలు కోల్పోతున్నారు. National Crime Records Bureau (NCRB) గణాంకాల ప్రకారం, 2022 లో సుమారు రూ.500 కోట్ల నష్టం వాటిల్లింది. వృద్ధులపై ప్రభావం: ప్రధానంగా వృద్ధులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్, ఫోన్ కాల్ స్కామ్స్, ఫిషింగ్ వంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరాల రికవరీ వివరాలు భారత ప్రభుత్వ పలు సంస్థలు నేరాల రికవరీ పట్ల కృషి చేస్తున్నాయి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ద్వారా ప్రజలకు మోసపోయిన డబ్బును రికవరీ చేయడానికి సహాయం అందిస్తున్నారు. 

కానీ, రికవరీ శాతం పరిమితంగానే ఉండటం గమనార్హం. 2023 గణాంకాల ప్రకారం, ఫైబర్ పేరొ 100 కోట్లకు పైగా రికవరీ చేశారు. కానీ, ఇంకా పెద్ద మొత్తంలో సొమ్ము కోల్పోవడం జరుగుతుంది. సైబర్ అవగాహన అవసరం వృద్ధుల అవగాహన: వృద్దులకు సైబర్ అవగాహన పెంపొందించటం అత్యవసరం. వాళ్ళను డిజిటల్ పరికరాల వినియోగంపై శిక్షణ ఇవ్వడం, భద్రతా జాగ్రత్తలు తీసుకోవడంపై మోలిక అవగాహన ఇవ్వడం ద్వారా ఉ సమస్యను కొంతమేరకు ప్రభుత్వ కార్యక్రమాలు: భారత ప్రభుత్వ సైబర్ సురక్షిత భారత్ (Cyber Surakshit Bharat) 20 కార్యక్రమాలు ప్రారంభించింది. కార్యక్రమాలు ప్రజల్లో ఫైబర్ భద్రతా అవగాహన పెంచే వీపని చేస్తున్నాయి. విభిన్నమైన సైబర్ మోసాల విధానాలు ఫిషింగ్ మెసేజ్ లు: బ్యాంక్ నుంచి వచ్చినట్లు, లక్కీడ్రా గెలిచినట్లు వృద్ధులకు సందేశాలు పంపించడం ద్వారా నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్ల సమాచారాన్ని దోచుకుంటున్నారు. 

వాలెట్ హ్యాకింగ్: గీశి), డిజిటల్ వాలెట్ హ్యాకింగ్ ద్వారా డబ్బును అక్రమంగా తస్కరించడం అప్రమత్తత, భద్రతా సూచనలు వీగిశి లను ఎవరితోనూ పంచుకోకండి: ఎక్కువగా వీగిశి ఆధారిత మోసాలు జరుగుతున్నాయి. వీగిశి లను సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ఖాతాలకు ప్రవేశం కోసం ఉపయోగిస్తాది.. శోధనలో తెలియని లింకులకు, సందేశాలకు ప్రతిస్పందిం చకుండా ఉండాలి. సైబర్ నేరాల భవిష్యత్తు: భవిష్యత్తులో సైబర్ నేరాలు మరింత అధునాతన మార్గాల్లో జరుగుతాయని అంచనా. ప్రభుత్వం ఆధునాతన సాంకేతిక పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు ప్రజల అవగాహనను కూడా పెంచాలి. అవగాహన పెంపొందించడంలో ముఖ్యమైన మార్గాలు ప్రముఖ మాధ్యమాలపై ప్రచారాలు: వృద్ధులకు సులువైన భాషలో అవగాహన కల్పించే ప్రకటనలు ప్రసారం చేయాలి. స్కామ్ అవేర్నెస్ క్యాంప్స్: పలు ప్రాంతాల్లో అవగాహన కార్యాక్రమాలను నిర్వహించడం. 

ఈ విధంగా ప్రజల అవగాహన పెంచడం, వారికి అవసరమైన భద్రతా సూచనలు ఇవ్వడం ద్వారా డిజిటల్ నేరాలను అధికంగా అరికట్టవచ్చు. 2023లో భారతదేశంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను బలవంతంగా మోసగించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం, ఆ సంవత్స రంలో సుమారు రూ. 1,000 కోట్లకు పైగా భారతీయులు డబ్బు కోల్పోయినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే, నష్టపోయిన మొత్తాన్ని రికవరీ చేయడం చాలామందికి కష్టంగా మారింది. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 ద్వారా ఫిర్యాదులు అందించిన వారికి రికవరీ కోసం ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2023లో రికవరీ అయిన మొత్తం సుమారు రూ. 200250 కోట్ల వరకు మాత్రమే ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కొరవడటం, రికవరీ ప్రక్రియలో ఉన్న సాంకేతిక సమస్యలు. సైబర్ నేరగాళ్లు, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి ఆర్థిక సమాచారం, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేందుకు వివిధ పద్ధతులను అవలంభిస్తున్నారు. 

ఈ నేరాలలో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఫిషింగ్, ఫోన్కాల్ స్కామ్స్, ఫేక్ లాటరీ సందేశాలు, సోషల్ మీడియా మోసాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళలు సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్, ఇతర డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఎక్కువగా వినియోగించడం వీరి సైబర్ భద్రతకు ప్రాధాన్యతను పెంచుతోంది. 2023లో సైబర్ నేరాల గణాంకాలు పరిశీలిస్తే, 3040 సైబర్ నేరాలు మహిళలను టార్గెట్ చేస్తూ జరిగాయని తెలుస్తోంది. సైబర్ నేరాలు, ముఖ్యంగా మహిళలు వారి వ్యక్తిగత సమాచారాన్ని అజ్ఞాత వ్యక్తులతో పంచుకోవడం లేదా తప్పుడు లింకులు క్లిక్ చేయడం వల్ల జరుగుతున్నాయి. టార్గెట్ చేయబడుతున్న పద్ధతులు: ఫేక్ బ్యాంక్ కాల్స్ : బ్యాంక్ ప్రతినిధులుగా నటిస్తూ మహిళల బ్యాంక్ డీటెయిల్స్ చెబితే అకౌంట్ నుండి డబ్బును క్షణాల్లో దోచేస్తున్నారు. ఫిషింగ్ మెసేజ్ లు: తప్పుడు లాటరీలు లేదా ఇన్స్టాంట్ రివార్డుల పేరుతో లింకులు పంపించి కూడా మోసగిస్తున్నారు. మహిళలను సోషల్ మీడియా ద్వారా దగ్గరగా వచ్చి వారిని మోసగిస్తున్నారు. 

రక్షణ మార్గాలు ఎలాంటి బ్యాంక్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. ఫేక్ లింకులు, మెసేజ్లు కనపడితే అప్రమత్తంగా ఉండాలి. సైబర్ అవగాహన కల్పించే కార్యక్రమాలలో పాల్గొని సురక్షితంగా ఉండాలి. ఇలా మహిళలకు సరైన భద్రతా సూచనలు ఇవ్వడం, వారికి సైబర్ భద్రతపై అవగాహన పెంచడం ద్వారా ఈ తరహా నేరాల నుండి రక్షణ కల్పించవచ్చు. ప్రభుత్వం, పలు సైబర్ భద్రతా సంస్థలు సైబర్ నేరాలను అరికట్టడంలో ముందుకువచ్చినా, నష్టపోయిన డబ్బును పునరుద్ధరించడంలో ఇంకా మెరుగైన మార్గాలను అన్వేషించే అవసరం ఉంది..

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cyber Law Cyber Safety Cyberbullying CyberCrime CyberSecurity Data breach Data Privacy Digital Crime Digital Forensics hacking Identity Theft Information Security Internet Scams malware Network Security Online Fraud Phishing Ransomware Social Engineering

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.