Iran Israel Conflict: జానెడు పొట్టకు గుప్పుడు మెతుకులు చాలు ఆకలి తీర్చుకోవడానికి. కొద్దిపాటి ఆహారంతో సమసిపోయే క్షుద్బాద కోట్లకొలది సంపద కోరుకుంటుందా?
సామ్రాజ్యాలను కొల్లగొట్టమని చెబుతుందా? యుద్ధాలతో రక్తపాతం సృష్టించమని చెబుతుందా? అణ్వాయుధాలతో జన హననం చేయమని చెబుతుందా?
ఎంత కాలం ఈ అలజడులు? ఎందుకోసం ఈ యుద్ధాలు?
Iran Israel Conflict: ఇతర దేశాలను కబళించాలని పరాయి దేశాలు ప్రయత్నిస్తే ఆ చర్యలను ధీటుగా తిప్పికొట్టడం సముచితం.
దేశ భక్తి, ఆత్మాభిమానం, సార్వభౌమత్వ పరిరక్షణ అన్ని దేశాలకు అవసరమే. కానీ తమ దేశమే గొప్పదని, తమ మాటే శాసనమని హూంకరించడం నియంతృత్వమే అవుతుంది.
అమెరికా లాంటి దేశాలు అహం అనే పునాదులపై నిర్మింపబడి, అగ్రరాజ్యమనే హోదాతో ఇతర దేశాలను లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం ఆక్షేపణీయం.
అగ్రరాజ్యాలు తమ వద్ద ఇబ్బడి ముబ్బడిగా ఆయుధాలను సమకూర్చుకుంటూ, అణ్వాయుధాలను పెంచుకుంటూ తమ రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించడంలో లేని తప్పు
ఇతర దేశాలు శతృదేశాల నుండి తమను తాము కాపాడుకోవడానికి తమ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో తప్పులు వెదకడం భావ్యమా?
ఆయుధ వ్యాపారం మొదలు పెట్టింది. అగ్రరాజ్యాలు కాదా?
ఒకప్పుడు ఇరాన్, ఇరాక్ కు ఆయుధ, ఆర్థిక సహకారం అందించిన అమెరికా తర్వాత కాలంలో అమెరికాకు ఎదురు తిరిగిన ఇరాక్ను నాశనం చేసి, సద్దాం హుస్సేనన్ను హతమార్చిన సంగతి మరువలేం.
ఇజ్రాయిల్-ఇరాన్లు ప్రస్తుతానికి శాంతించినా, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా మధ్య ప్రాచ్యం మారణహోమం నుండి పూర్తిగా బయట పడలేదనే చెప్పాలి.
పూర్తి స్థాయిలో శాంతి ఒప్పందం కుదిరితేనే పరిస్థితులు కుదుట పడగలవు. ఇరాన్, ఇజ్రాయిల్లు సమీప భవిష్యత్తులో తిరిగి సంఘర్షణాత్మక పంథాలో పయనించబోవనే నమ్మకమైతే లేదు.
ఇరు దేశాలు కాల్పుల విరమణకు ముందు పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి.
ఇరాన్-ఇరాక్ల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరినట్టు ట్రంప్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో తాత్కాలిక శాంతి వాతావరణం నెలకొంది.
అమెరికా జోక్యం అవసరమా ??
అసలు ఇరాన్ ఇజ్రాయిల్ గొడవల్లో అమెరికా (USA) తలదూర్చడమేమిటి? అమెరికా, నాటో దేశాల జోక్యం వలనే రష్యా, ఉక్రెయిన్లు సుమారు మూడున్నర సంవత్సరాలుగా అవిశ్రాంతంగా భీకర పోరు సాగిస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన సైనికులు, పౌరులు సుమారు పదిహేడు లక్షల 90 మందికి పైగా మరణించినట్టు కొన్ని నివేదికలు తమ గణాంకాల ద్వారా తేటతెల్లం చేసాయి. ఇరు దేశాల మధ్య సాగుతున్న యుద్ధం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టింది. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న ప్రపంచ దేశాలకు ఇరు దేశాల మధ్య దూరి సమస్యను జటిలం చేసింది. ఇజ్రాయిల్ పులిమీద పుట్రలా ఇరాన్ ఇరాక్ యుద్ధం దాపురించింది. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న ప్రపంచ దేశాలకు ఇరు దేశాల మధ్య దూరి సమస్యను జటిలం చేసింది. ఇజ్రాయిల్ పులిమీద పుట్రలా ఇరాన్ ఇరాక్ యుద్ధం దాపురించింది. మధ్యలో అమెరికా తలదూర్చడాన్ని పలు దేశాలు తప్పుబట్టాయి.
తమ దేశాలను అణ్వస్త్రాలతో నింపుకున్న అమెరికా- ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ అణుశక్తి కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుకోవడంలో ఔచిత్యం లేదు. తానొక శాంతి దూతనని స్వయంగా ప్రకటించుకున్న స్వయం ప్రకటిత మేధావి డేనాల్డ్ ట్రంప్, రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని నిలువరించడంలో దారుణంగా విఫలమై ఎప్పుడు ఇరాన్ పై దాడులకు పాల్పడి, ఇజ్రాయిలు మద్దతునిచ్చి పెద్ద తప్పిదమే చేసాడు. ఒకవైపు యుద్ధాలకు పురిగొల్పుతూ నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పాకులాడడం కొంగ జపం చేయడం వంటి విన్యాసమే.
భారత్ ఇతర దేశాలకు ఎందుకు విరోధం?
చైనా, బంగ్లాదేశ్, టర్కీ, అజర్ బైజాన్ వంటి దేశాలు భారత్ పట్ల ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయి? భారత్ వలన మేలు పొందిన దేశాలు ఎందుకు కీడు తలపెడుతున్నాయి? పహల్గాం సంఘటన తీవ్రతను ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఎందుకు అంత తీవ్రంగా గుర్తించడం లేదు? పాక్ వలన ఏర్పడే ముప్పును నిలువరించడంలో ఎందుకంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి? ప్రపంచం దృష్టికి పాక్ కుట్రలను తీసుకురావడానికి భారత ప్రతినిధి బృందం వివిధ దేశాల్లో పర్యటించింది. అయినా పెద్దగా ప్రయోజనమేమీ కనిపించలేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సాయం చేయడం తగునా? ఈ విషయాలపై లోతైన విశ్లేషణ జరగాలి.
పహల్గాంలో జరిగిన పాక్ ప్రేరిత నరమేధానికి ప్రతీకారంగా భారత్ దాయాది దేశమైన పాక్కు బుద్ధి చెప్పాలని తలంచి, ఆపరేషన్ సిందూరు శ్రీకారం చుట్టింది.
అంతకు ముందే పాక్తో ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ భారత్ తెగలెంపులు చేసుకుంది. సుదీర్ఘ కాలంగా పాక్తో కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా సాగవలసిన ఆపరేషన్ సిందూర్ పాక్ దుందుడుకు చర్యలతో యుద్ధంలా మారి, చివరికి పాఠ్ ప్రాధేయపడడంతో సమసిపోయింది.
భారత్ సైనికుల సాహసానికి పాక్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగినా, భారత్ వ్యూహాలకు దాయాది దేశం టెంటేలెత్తి పోయింది. పాక్ ఆర్మీ, సివిలియన్స్ జోలికి పోకుండా కేవలం ఉగ్రవాద పోస్టులను నిర్వీర్యం చేయడానికి పరిమితమైన భారత్ను పాక్ రెచ్చగొట్టింది. ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని వాదిస్తున్న పాక్ నాయకులు, మిలటరీ పెద్దలు ఆపరేషన్ సిందూర్లో హతులైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావడం, ఉగ్రవాద చర్యలకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా భారత్ జరిపిన ఆపరేషన్లో చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు నష్టపరిహారమందించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మసూద్ అజహర్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయా విదితమే. ఈ కరడు గట్టిన ఉగ్రవాది మసూద్ అజహరక్కు పాక్ ప్రభుత్వం పధ్నాలుగు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ చర్య ద్వారా ప్రపంచం దృష్టిలో పాక్ దోషిగా నిలబడింది. ఉగ్రవాదులకు పాక్ ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనమేముంటుంది?
పాక్-టర్కీల ప్రేమాయణం
Iran Israel Conflict: మిడిల్ ఈస్ట్ దేశమైన టర్కీతో భారత్కు ఎలాంటి విభేదాలు లేవు.
ప్రస్తుతం తుర్కియేగా పిలవబడుతున్న టర్కీ కోవిడ్ సమయంలో మందులు లేక విలవిల్లాడుతున్న సందర్బలలో మందులు సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలను భారత్ ఆడుకుంది.
భూకంపంతో భయానక పరిస్థితులు ఏర్పడిన తుర్కియేకు భారత్ ఉదారంగా సాయం చేసింది.
పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుందో ఇటీవల భారత్పై ఎగిరిన తుర్కియే డ్రోన్లు, పాక్ సైనికుల చేతిలో ఉన్న ఆయుధ సామాగ్రి తేటతెల్లం చేసింది. ఇంతకంటే నమ్మక ద్రోహం మరొకటుండదు.
కృతజ్ఞత మరచిన టర్కీ ఇటీవల భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో పాక్కు భారీగా ఆయుధాలను డ్రోన్లను సరఫరా చేసింది. భారత్ పై పాక్ ప్రయోగించిన డ్రన్లన్నీ టర్కీకి సంబంధించినవి. ఆయుధాలు, డ్రోన్లను పాక్ కు సరఫరా చేసినందుకు, పాకు మద్దతునిచ్చినందుకుగాను భారత్ టర్కీపై నిషేధం విధించింది.
సింధు జలాలు ఇక పాక్ లో ప్రవహించునా?
Iran Israel Conflict: సింధు జలాలను విడుదల చేయాలని పాక్ ప్రభుత్వం భారత్ కు అనేక లేఖలు రాసినా భారత్ దీనిపై పెద్దగా ప్రతిస్పందించలేదు.
పి.ఒ.కె.ను తనకు అప్పగిస్తేనే సింధు జలాలను విడుదల చేస్తామని భారత్ పేర్కొనడం విశేషం.
ఇప్పటికే నీరు లేక పాక్ ప్రజల్లో అలజడి మొదలైనది. సింధు జలాల విషయంలో భారత్ రాజీ లేని వైఖరి అవలంభించడం పాక్ కు మింగుడు పడడం లేదు.
అమెరికా ధోరణి అసమంజసం
భారత్ సమగ్రతను దెబ్బతీయాలని చైనా ఒకవైపు ప్రయత్నిస్తుంటే, మరొక అగ్రదేశం అమెరికా భారత్ను వాణిజ్య చట్రంలో ఇరికించాలని ప్రయత్నిస్తున్నది. ఉక్రెయిన్తో మినరల్ డీల్ కోసం పట్టుబట్టిన అమెరికా ఉక్రెయిన్ భద్రతను గాలికి వదిలేసింది. పాక్తో ట్రంప్ లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని, స్వయంగా తన కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చడానికి చేసిన ప్రయత్నం కారణంగానే భారత్ను అమెరికా వాణిజ్య వ్యూహంలోకి నెడుతున్నది.
ప్రపంచ దేశాలతో భారత్ కు దౌత్య వాణిజ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. అమెరికా మాత్రం మోడీ నా మిత్రుడు అంటూనే, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ భారత్కు ఎసరు పెడుతున్నాడు. యూరోపియన్ యూనియన్లో 27 సభ్యత్వ దేశాలున్నాయి. వీటిలో ట్రంప్ ధోరణి నచ్చక, రెసిప్రోకల్ టారిఫ్లతో విసుగెత్తి చాలా దేశాలు భారత్తో వాణిజ్య సంబంధాలు నెలకొల్పకోవడానికి ఉత్సుకత చూపుతున్నాయి. ఇస్లాం దేశాలు కూడా ప్రస్తుతం పాకు మద్దతునివ్వడం లేదు. బ్రిక్స్ దేశాల్లో చైనా తప్ప మిగిలిన దేశాలతో భారత్ సఖ్యతగానే ఉంటున్నది. కాని యూరోపియన్ పట్ల, బ్రిక్స్ దేశాల పట్ల ట్రంప్ ధోరణి వ్యతిరేకంగానే ఉంది. బ్రిక్స్ కూటమి తమకు వ్యతిరేకంగా ఏర్పడిన
కూటమిగా ట్రంప్ భావన, డాలర్ కు ప్రత్యామ్నాయంగా కరెన్సీ ఏర్పాటు చేసుకుంటే సహించేది లేదని ట్రంప్ హెచ్చరించడం సముచితం కాదు. నాటో పట్ల కూడా ఇటీవల ట్రంప్ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారు.
కెనడా, గ్రీన్ లాండ్, పనామాల పట్ల ట్రంప్ చాలా దురుసుగా ప్రవర్తించి నగుబాటు పాలైన విషయం మరవక ముందే, భారత్ పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ అభాసుపాలవడం చూస్తున్నాం. ఇండో పసిఫిక్ రీజియన్ భద్రతకు, శాంతి సుస్థిరతలకు, అభివృద్ధి కోసం ఏర్పడిన క్వాడ్ కూటమిలో సభ్యదేశమైన అమెరికా నిర్వాకం సముచితంగా లేదు. కేవలం తన కుటుంబ కంపెనీల కోసం పాక్తో ఒప్పందం చేసుకుని, భారత్-పాక్ల మధ్య సీజ్ ఫైర్ కోసం తానేదో భారత్ను బెదిరించినట్టుగా బీరాలు పలకడం ట్రంప్ స్వార్థాన్ని, ఆహాన్ని సూచిస్తున్నది.
భారత్ లో యాపిల్ కంపెనీలు పెట్టవలసిన అవసరం లేదని, అమెరికాలో పెట్టాలని ఇటీవల ట్రంప్ యాపిల్ సి.ఇ.ఓ కు చెప్పడం
అభ్యంతరకరం. అమెరికా ఇలాగే ప్రవర్తిస్తే భారత్ సహించకూడదు. అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గించకూడదు. అమెరికాతో భారత్ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే, అమెరికా కూడా తీవ్రంగా నష్టపోతుంది. అమెరికా ఎగుమతులకు భారత్ ఒక కేంద్ర స్థానంగా ఉంది. అమెరికా ఎగుమతుల్లో 18 శాతం భారత్ దేశానికే. ఈ విషయాన్ని అమెరికా బాగా గుర్తుంచుకోవాలి. అలాగే అమెరికా ఉత్పత్తులకు ఇండియా జీరో టాక్స్ వేయడానికి అంగీకరించినట్టు ట్రంప్ పేర్కొనడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు ఇండియా ప్రతిస్పందించకపోవడం సబబుగా లేదు. ట్రంప్ మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని, అమెరికాలోని కొంతమంది మాజీ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
పొరుగు దేశాల పోరు దాయాదీ దేశం తీరు
ఇరుగు-పొరుగు దేశాల మోసపూరిత వైఖరి వలన భారత్ ఇప్పటికి తగిన మూల్యం చెల్లించుకున్న విషయాన్ని ప్రత్యేకంగా వివరించనక్కరలేదు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మ్యాన్మార్, మాల్దీవులు, శ్రీలంక తదితర దేశాలు భారతదేశానికి పొరుగునున్న దేశాలు. మనకు దూరంగా ఉన్న దేశాలతో ప్రమాదం లేకపోవచ్చు కాని, మన పొరుగు దేశాలు సక్రమంగా లేకపోతే ఎంత ప్రమాదకరమో భారత్కు పొరుగునున్న చైనా, పాక్, బంగ్లాదేశ్లల నిర్వాకం చూస్తే అవగతం అవుతుంది.
పాక్, చైనాలు చేసిన ద్రోహం అటుంచితే, మన పొరుగునున్న బంగ్లాదేశ్ భారత్ చేసిన సాయాన్ని మరచి మన శతృదేశంతో స్నేహం చేస్తున్నది. శ్రీలంక కూడా చైనాతో స్నేహం చేసి, అప్పుల పాలై ఆర్థికంగా దివాళా తీసి, ప్రస్తుతం వార్తల్లో కనిపించని దేశంగా మౌనం పాటిస్తున్నది. ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం భారత్ సహాయం కోరిన బంగ్లాదేశ్ నేడు విశ్వాస ఘాతుకానికి తలపడుతున్నది.
ఆంగ్లేయుల విభజన వాదానికి ఆకర్షితులై, ఆంగ్ల పాలకులు పెట్టిన మత పరమైన చిచ్చుకు దహిందుకుపోయి మత ప్రాతిపదికన దేశాన్ని విభజించుకుని, స్వతంత్ర పాకిస్తాన్గా ఏర్పడి ఈ 77 సంవత్సరాలుగా పాకిస్తాన్ సాధించిందేమిటి? పాకిస్తాన్లో ఎంతో మంది పాలకులు మారారు. నియంతలొచ్చారు. పాకిస్తాన్ మాత్రం అభివృద్ధి సాదించలేదు. ప్రజల అవసరాలు ఉంటేలేదు. ప్రజల అసంతృప్తిని చల్లార్చడానికి మఠాన్ని వాడుకోవడం, ఉగ్రవాదులను ప్రోత్సహించి, నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరపడం, భారత్ ఆధీనంలోని కాశ్మీర్లోకి చొరబడి, అమాయక ప్రజలను నిర్ధాక్షిణ్యంగా చంపడం, అందుకు పాక్ ఆక్రమిత కాశ్మీరు స్థావరంగా ఏర్పాటు చేసుకుని లక్షలాది మంది యువకులను విద్యకు, ఉపాధికి దూరం చేసి ఉగ్రవాదులుగా తయారు చేసి, భారత్లో నరమేధానికి పురిగొల్పడం.. ఇది గత ఏడున్నర దశాబ్దాలకు పైగా పాకిస్తాన్ సాగిస్తున్న నిర్వాకం, సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని భారత్ ఎన్నో సార్లు పాకిస్తాన్కు విజ్ఞప్తి చేసింది. పాక్ మనసు మారాలని తపించింది. ఎన్నో ఒప్పందాలు చేసుకుంది. ఐక్యరాజ్య సమితికి, అగ్రరాజ్యాలకు లెక్కలేనన్ని వినతులు చేసింది. పాక్కు నయానా భయానా నచ్చచెప్పింది. 1947-48 మధ్య, 1965 5, 1971 5, 1999 యుద్ధానికి తలపడింది.
పాక్ భారత్ చేతిలో ఓడిపోతూనే ఉంది. అయినా పాక్ పాక్ పొగరణగలేదు. భారతీయుల రక్తంతో ఎరుపెక్కిన పాక్ ఉగ్రవాదుల హస్తాలు పాక్ పాలిట భస్మాసుర హస్తాలై పాక్ మనుగడను ప్రశ్నార్ధకం చేసాయి. 1971లో పాక్ నుండి తూర్పు బెంగాల్ చీలిపోయి, బంగ్లాదేశ్ ఏర్పడింది. తాలిబాన్లతో అంటకాగి, చివరకు తాలిబాన్లకే శత్రువుగా మారింది. ఆఫ్ఘనిస్తాన్కు అడ్డం తిరిగింది. బలూచిస్తాన్ గురిచూసి పాక్ను దెబ్బకొట్టింది. సింధ్ ప్రాంతంలో ప్రజలు
పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు పాక్ సైనికుల పీడ వదిలించుకుని భారత్లో విలీనం కావాలని ఆశిస్తున్నారు. పాక్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చైనా పడగ నీడలో సుఖనిద్ర పోవాలని తలపిస్తున్నది. పాక్ జుట్టు చైనా చేతికి చిక్కింది. ప్రజల చేతిలో చిప్ప పెట్టి అడుక్కోమని చెబుతున్న
పాక్ ఇంకా కాశ్మీర్ కోసం భారత్ తో పోరాడడం దేనికి? పోగొట్టుకోవడానికి పాక్ వద్ద మిగిలిందేమిటి? అమాయకుల రుధిరంతో పైశాచిక ఆనందం పొందడం తప్పు. మానవ హక్కులకు విలువుండదు. పాక్ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినా, సైనికుల ఆదేశాలే పాక్ పాలకులకు శిరోధార్యాలుగా మారిపోయాయి. సైనికుల మాట పెడచెవిన పెడితే పాలకులకు ఉరిశిక్షలు, యావజ్ఞాన కారాగార శిక్షలు, అవినీతి కేసులు, అరదండాలు. ఇది పాకిస్తాన్ రాజకీయ రణరంగంలో కొనసాగుతున్న ప్రహసనం. ప్రజాస్వామ్య దేశానికి, మిలటరీ కనుసన్నల్లో నడిచే దేశానికి ఎంతటి వ్యత్యాసముంటుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
భారత్ ప్రకటించిన ఆపరేషన్ సిందూర్ లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని సైనికులకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మిలటరీ అధికారులు, సైన్యం తూ.చ తప్పకుండా పాటించడం జరిగింది. భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరపడం, అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వానికి మద్దతునివ్వడం వంటి ప్రజాస్వామ్య వాతావరణం భారత్లో స్పష్టంగా అగుపించింది. పాకిస్తాన్లో భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. మిలటరీ ఉగ్రవాదుల కనుసన్నల్లో పాక్ ప్రభుత్వం పని చేసింది. పాక్ మిలటరీలో లుకలుకలు, రాజకీయ పక్షాల్లో కలహాలు, పాక్ ప్రధాని ఏడ్పులు, భారత్కు హెచ్చరికలు-ఇలాంటి సన్నివేశాలతో పాక్ రాజకీయాలు అపహాస్యంగా మారాయి.
ఎన్నో ప్రగల్బాలు పలికిన పాక్, భారత్తో కాళ్ల బేరానికొచ్చి, దాడులు ఆపాలని భారత్ డి.జి.ఎం.ఓ ను వేడుకోవడంతో భారత్ అందుకు అంగీకరించింది. సింధు జలాలను విడుదల చేసి ఆదుకోవాలని భారత్కు పాక్ లేఖలు రాస్తూనే, సింధూ నదీ జలాలను ఆపితే సింధు నదిలో ప్రహహించేది నీళ్లు కాదు భారతీయుల రక్తమని కారుకూతలు కూసిన ఉగ్రమూకల విషయంలో పాక్ ప్రధాని, ఆర్మీ చీప్లు తన వైఖరిని వెల్లడించకుండా ఇలా లేఖలు రాయడం, మధ్యవర్తులతో భారత్ను శాంతింప చేయాలనుకోవడం పొరపాటు.
ప్రపంచ దేశాల మధ్య తలెత్తిన ఎన్నో సమస్యలకు దారి చూపి, ఎన్నో సంక్షోభాలను తన మధ్యవర్తిత్వంతో సమసిపోయేలా చేసిన సుదీర్ఘ చరిత్ర గల అమెరికా ఇప్పుడు ట్రంప్ హయాంలో ఇంతగా దిగజారిపోవడం బాధాకరం. జార్జి వాషింగ్టన్, జెఫర్సన్, అబ్రహాం లింకన్, కెనడీ, ఒబామా లాంటి మహామహులు ఏలిన అమెరికా ట్రంప్ ఏలుబడిలో అపఖ్యాతిపాలై చరిత్ర పుటల్లో హీనంగా మిగిలే దుర్దినాలకు దగ్గర దశలో ఉంది. పాక్ తాను భారతన్ను ఢీకొట్టి ఓడిపోయినా గెలిచినట్టు గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. పాక్ అణ్వాయుధ పాటవం ప్రపంచానికి ప్రమాదం. పాక్లో ఇప్పటికీ అణ్వాయుధ గిడ్డంగులుంటే, వాటిని అంతర్జాతీయ సమాజం గుర్తించి, పాక్ నుండి దూరం చేయాలి. నిర్వీర్యం చేయాలి. ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసిన అమెరికా పాక్ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం బాధ్యతా రాహిత్యం.
Iran Israel Conflict: యుద్ధాల్లో అంతా పరాజితులే
యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరు. ఇరాన్-ఇజ్రాయిల్, రష్యా- ఉక్రెయిన్, భారత్-పాక్ల మధ్య జరిగిన సంఘర్షణలో ఈ విషయం నిరూపితమైనది. పాక్ భారీగా నష్టపోయింది.
సింధు జలాలను భారత్ నిలిపివేయడంతో పాక్ లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఆర్ధికంగా దివాళా తీసిన పాక్ చైనాకు అమ్ముడు పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
భారత్ విజయం సాధించినా కొంతమంది సైనికులను, కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయిన మాట వాస్తవం. యుద్ధాల వలన ఇలాంటి నష్టాలు జరగడం సహజం.
పాక్దు శ్చర్యలతో విసుగెత్తి పోయిన భారత్ పాక్కు తనదైన శైలిలో బుద్ధి చెప్పింది. ఇదే సందర్భంలో పొరుగునున్న చైనా కూడా భారత్ రక్షణ సామర్థ్యం చూసి విస్తుపోయింది.
ఇక నుంచి భారత్ కూడా తన రక్షణ బడ్జెట్ను మరింత పెంచుకోక తప్పదు. దీని వలన ప్రజలపై ఎంతో కొంత ఆర్ధిక భారం పడుతుంది.
నాల్గవ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ మరింత ఆర్ధికంగా బలపడడానికి యుద్ధాలు అవరోధంగా మారుతున్నాయి.
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య సంధి కుదరకపోతే భారత్ కూడా ఆర్థికంగా ప్రభావితమయ్యేది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తానని ఇరాన్ చేసిన ప్రకటన ప్రపంచంలోని పలు దేశాలను భయకంపితులను చేసింది.
ఈ జలసంధిని మూసి వేస్తే భారత్, చైనాతో పాటు పలు దేశాలకు క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోయి, ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలున్నాయి.
ఇరాన్ ఇజ్రాయిల్ సంక్షోభానికి తాత్కాలిక విరామం ప్రకటించబడినా, అమెరికా సారథ్యంలో జరిగే శాంతి చర్చల్లో ఏదైనా ప్రతిష్టంభన చోటు చేసుకుంటే వ్యవహారం మొదటికొచ్చి,
ఇరుదేశాలు మళ్ళీ యుద్ధానికి తలపడే అవకాశాలను తోసిపుచ్చలేం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసి యుద్ధాల పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్న మాట వాస్తవం.
పెరుగుతున్న అవసరాలు, ఆర్ధిక పరిస్థితులు జన జీవితాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో గతంలో మాదిరిగా ప్రజలు యుద్ధాలను గుడ్డిగా సమర్థిస్తూ ఆవేశంతో ఉగిపోయే పరిస్థితులు లేవు.
ఈ వాస్తవాన్ని యుద్ధోన్మాదులు గుర్తించాలి. అనేక ప్రపంచ దేశాలతో వాణిజ్య సంబంధాలు గల భారత్కు ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు ఆర్ధిక ప్రగతికి అవరోధంగా మారే అవకాశాలున్నాయి.
యుద్దాలు ఎవరికీ శ్రేయస్కరం కాదు. యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరు.
వివిధ దేశాల వ్యూహాలను ఎప్పటికప్పుడు కని పెడుతూనే భారత్ తన పటిష్టమైన ఆర్ధిక వ్యూహాలతో దేశాన్ని బలోపేతం చేయాలి.
యుద్ధాల జోలికి పోకుండానే, పాక్ వంటి ఇరుగు పొరుగు దేశాల దుర్మార్గాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావాలి.
అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, ప్రపంచంలోని అన్ని దేశాలతో ఆర్ధిక సంబంధాలను పటిష్టం చేసుకోవాలి.
ప్రపంచంలో జరిగే యుద్ధాలను నివారించడానికి భారత్ నడుం బిగించాలి. యుద్ధాలు అభివృద్ధికి అవరోధమని యుద్ధోన్మాద దేశాలకు దాటి చెప్పాలి.