📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Amma: భగవంతుని ప్రతిరూపం అమ్మ

Author Icon By Digital
Updated: July 4, 2025 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమ్మ – ప్రత్యక్ష దైవం

అమ్మ భాషకు అందని గొప్ప భావం కనిపించే ప్రత్యక్ష దైవం. ఆది గురువు అమ్మ. మంచి నడత, నడక నేర్పేది అమ్మ. తల్లిని మించిన ప్రేమ మృత మూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రపంచం ఆధునికతతో తన రూపం మార్చుకున్నా అమ్మ(mother) ప్రేమ అజరామరం, ఎన్నటికీ చెరగని మధురానుభవం. అమ్మ ఆశీస్సులు కొండంత అండ. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గుండెల్లో దాచుకొని కాపాడే మనసత్తత్వం కేవలం అమ్మకి మాత్రమే ఉంటుంది.

అమ్మ ప్రేమ – అజరామరం

ఈ సృష్టికి మూలమైన అమృత భాండం పంచే అనురాగం, మమకారం, ఆప్యాయత వెలకట్టలేని ప్రేమ అమ్మది. అందుకే ఆ నింగి కూడా తలవంచుతుంది. అమ్మ పంచే అనురాగానికి సముద్రం కూడా చిన్న బోతుంది. అమ్మ తనలో దాచుకున్న కన్నీళ్లను చూసి వెన్నెల కూడా దాసోహం అవుతుంది. తన అందమైన ఆత్మీయతకి అమృతం కూడా అవసరం ఉండదు అమ్మ చేతి గోరుముద్దలకి. అందుకే అమ్మలో సహనం, క్షమాగుణం, ఓర్పు, స్నేహం లాంటి అద్భుతమైన ప్రవృతులు సజీవంగా ఉంటాయి.

అమ్మ ఆశీస్సులు – కొండంత అండ

అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ (mother) లేకపోతే గమనం లేదు, అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదు. దేవుడు లేడనే మనిషి ఉంటాడు కానీ అమ్మ లేదనే మనిషి ఉండడు. మనిషి జీవితాంతం వెంట ఉండేది తల్లి ప్రేమే. ఈ ప్రపంచం తల్లికిచ్చిన గౌరవం వేరే ఏ బంధానికి ఇవ్వదు. తల్లి ప్రతిక్షణం తన బిడ్డ కోసమే పరితప్పిస్తూ ఉంటుంది. 10 నెలలు మోసి పాలిచ్చి పెంచి బిడ్డకు ఎన్నో సేవలు చేస్తుంది. ఆశలన్నీ ధారపోసి పెంచుకుంటుంది.

అమ్మ ప్రేమలో స్వార్థం లేదు

అమ్మ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు. అహర్నిశలు కష్టపడుతుంది. ఎన్ని కష్టాలెదురైనా బిడ్డ సుఖం కోసం చిరునవ్వుతో అధిగమిస్తుంది. అందుకే ఈ లోకంలో అన్నింటి కన్నా అమూల్యమైనది, అతి మధురమైనది, అనంతమైనది అమ్మ అనురాగం మాత్రమే. ఎన్ని బంధాలు ఉన్నా మాతృప్రేమలో ఉన్న అనుభూతి.

మాతృదినోత్సవానికి ఆవిర్భావం

అమెరికన్ సివిల్ వార్ టైంలో ‘వార్ స్లోజర్స్’కి చాలా సేవలు చేసింది. అంతేకాకుండా ‘మదర్స్ డే వర్క్స్ క్లబ్’ ని స్థాపించి పబ్లిక్ హెల్త్ కోసం పనిచేశారు. ఆమె మరణించిన తర్వాత ఆమె కూతురు అన్న జార్విస్ తన తల్లి చేసిన సేవలకి గుర్తుగా మాతృదినోత్సవాన్ని సెలవు రోజుగా ప్రకటించమని 1905 నుంచి క్యాంపెయిన్ మొదలు పెట్టింది.

ఆ తర్వాత 1908లో తన తల్లిని గుర్తు చేసుకుంటూ మెమోరియల్ సెయింటల్ యాండ్రోస్ మెథడ్రా లాజికల్ చర్చిలో మొట్టమొదటిసారిగా మాతృదినోత్సవాన్ని జరిపారు. కానీ అధికారికంగా మాతృదినోత్సవం కోసం 1908లో పెట్టిన ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది యూఎస్ గవర్నమెంట్. ఆ తర్వాత 1911లో అధికారికంగా మాతృదినోత్సవాన్ని ప్రభుత్వం వారే ప్రకటించారు.

అప్పటినుండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం రోజున మనమంతా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన సంస్కృతిలో మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పారు. అంటే తల్లి తండ్రి, గురువు దైవంతో సమానం. మనం తల్లిని పూజిస్తాం దైవంతో సమానంగా చూస్తాం.

తల్లి దీవినే దేవునికి సమానం

అందుకే దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని(mother) ఆమేన మూల కారణం. ప్రతి మనిషికి తొలి గురువు అమ్మ. మనం వేసే అడుగును నడిపించే మార్గదర్శి, దేవ మూర్తులంతా కూడా అమ్మ ఆలనా పాలనలోనే అంతటివారయ్యారు. అందుకే స్వర్గం ఎక్కడుంది అంటే తల్లి పాదాల చెంతనే ఉంది అంటారు పెద్దలు.

మనం ఈ భూమాత పొత్తిళ్లలోకి రావడానికి 9 నెలల ముందు నుంచే అమ్మ రూపం, అమ్మ తన కడుపులో దాచుకొని కంటికి రెప్పలా కాపాడుతుంది మనల్ని. తాను పురుటి నొప్పుల్ని పంటి బిగువున భరిస్తూ మనకి అద్భుతమైన అందమైన జన్మనిస్తుంది. మనం ఆకలి అని అడగకముందే పాలిచ్చి లాలిస్తుంది.

తల్లి ప్రేమ – అదృష్టాన్ని తెచ్చేది

మనకి మాటలు రాకపోయినా అర్థం చేసుకొని మన అవసరాలకు తెలుసుకో అన్ని ప్రేమతో అందిస్తుంది, తీరుస్తుంది. మనం పాఠశాల వెళ్లకముందే ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. మనకి స్నేహతులు అంటే ఎవరో తెలియకముందు మనతో స్నేహం చేసి ఆడిస్తుంది, లాలిస్తుంది. ప్రాణప్రదంగా చూసుకుంటుంది.

ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తరగని కావ్యంగానే ఉంటుంది. దేవతలకు అమృతాన్ని పంచిన దేవుడు అంతకంటే కమ్మనైన ప్రేమామృతాన్ని అమ్మ ద్వారా మనకు అందించాడు. ఇంతకంటే అదృష్టం ఉంటుందా? ఈ జన్మకు.

అందుకే లోకమంతా ఓ వైపు ఉంటే అమ్మవైపు నేనుంటానంటాడు ఓ కవి. అమ్మ (mother) ఉంటే అన్ని ఉన్నట్టే. అందరూ ఉన్న ఓ దారి చూపిన, బాధను తరిమిన బాధ్యతను తెలిపి బంగారు భవిష్యత్తును అందించిన అమ్మ దీవినే కొలిస్తేనే పలికేది ఆ దేవుడు కానీ పిలవకుండా పలికేదీ అమ్మ మనసు మాత్రమే.

ప్రపంచంలో పూజించాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఆమె కన్న తల్లి. మాతృదేవోభ అంటూ అమ్మని పూజిద్దాం.

#telugu News amma affection amma quotes Breaking News in Telugu celebrating motherhood Google news Google News in Telugu greatness of mother Latest News in Telugu mother blessings mother's day mother's love respect mother Telugu News Paper unconditional love

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.