📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Attar: మట్టివాసన అత్తర్

Author Icon By Digital
Updated: June 19, 2025 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తొలకరి జల్లుల సువాసనను పంచే అత్తర్

రకరకాల పెర్ఫ్యూమ్స్ వాడుతుంటాం కదా! తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తర్ (Attar)గురించి విన్నారా..! అలాంటి అత్తరును మనదేశంలోని పెర్ఫ్యూమ్స్ రాజధానిగా పిలిచే ఉత్తరప్రదేశ్ కన్నాజ్ ప్రాంతం తయారు చేస్తుంది. నిజానికి ఈ మట్టివాసనను ‘పెట్టికోర్’ అంటారు. అయితే కన్నౌజ్ ప్రాంతంలో దీన్నే “మిట్టి అత్తర్”(Attar) పేరుతో ఈ పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తున్నారు.

పురాతన పద్ధతిలో అత్తర్ తయారీ

దీన్ని పురాతన భారతీయ సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. చెప్పాలంటే ఇది అత్యంత శ్రమ, సమయంతో కూడిన పద్ధతి. అందుకోసం వాళ్ళు ఎలాంటి కెమికల్స్ వంటి వాటిని ఉపయోగించరు. మరీ వర్షం కురిసినప్పుడు వచ్చే నేల వాసనను పోలిన అత్తరు తయారికీ ఏం ఉపయోగిస్తారంటే… గంగానది ఒడ్డున ఉండే మట్టిని, గులాబీ రేకులు లేదా మల్లెపువ్వులతో ఈ అత్తరుని తయారు చేస్తారు.

ఐదువేల ఏళ్ల సంప్రదాయం

తయారీ విధానానికి ఉపయోగించే పాత్రలు సింధులోయ నాగరికత టైంలో ఉపయోగించినవి. ఈ అత్తరు (Attarతయారీ విధానం దాదాపు ఐదువేల ఏళ్ల నాటిది. కానీ ఇప్పటికీ అదే పద్ధతిలోనే అత్తరు తయారు చేయడం కన్నాజ్ ప్రాంతవాసుల ప్రత్యేకత. అంతేగాదు తయారీ మొత్తం పర్యావరణ హితంగానే చేస్తారు.

అత్తర్ ప్యాకింగ్ విధానం

ప్రాసెసింగ్ పద్ధతుల్లో కూడా కేవలం కట్టెల పొయ్యలతో మండిస్తారు. ఇక ప్యాకింగ్ వద్దకు వస్తే చిన్న లెదర్ బాటిల్ రూపంలో ఈ అత్తర్లను మార్కెట్లోకి తీసుకువస్తారు.

ఆధునిక మార్పులు

ప్రస్తుతం ఈ అత్తరు తయారీ పద్ధతిని సవరించి.. బొగ్గులు, కట్టెల పొయ్యలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మరింత అనుకూలమైన పద్ధతులు కోస్తూ అన్వేషిస్తున్నట్లు పాక్రాన్స్ అండ్ ప్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఎసీ) వారు చెబుతున్నారు.

attar attar making process Breaking News in Telugu earthy fragrance eco-friendly perfume Google news Google News in Telugu indian attar indian perfume industry kannauj attar Latest News in Telugu matti vasana attar mitti attar natural perfume Paper Telugu News Telugu News Telugu News online Today news traditional attar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.