ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా 2023, ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది . దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అలాగే, చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా రికార్డులకెక్కింది.విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని భారత్ నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో ఈ శివశక్తి ప్రాంతానికి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి.భూమిపై జీవం ఆవిర్భవించడానికి ముందే ఈ ప్రాంతం ఆవిర్భవించిందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన తొలి భౌగోళిక పటాన్ని ‘ఇండియన్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ’ బృందం రూపొందించింది.ఈ పటాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఇది 370 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడి ఉంటుందని అంచనా వేశారు. భూమిపై తొలి జీవ రూపాలు కూడా అదే సమయంలో ఆవిర్భవించాయి. భౌగోళిక మ్యాపింగ్ అనేది ఓ ప్రాథమిక ప్రక్రియ అని ల్యాబొరేటరీ బృందం పేర్కొంది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘సైన్స్ డైరెక్టర్’ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి.

భౌగోళిక మ్యాపింగ్ అనేది ఓ ప్రాథమిక ప్రక్రియ అని బృందం పేర్కొంది. ఒక గ్రాహం ఉపరితల ఆకృతి ప్రాదేశిక. తాత్కాలిక క్రమాలను అర్థం చేసుకోవడం లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించింది.చంద్రయాన్-3 మిషన్ ఆగష్టు 23 ,2023 లో చంద్రుడి దక్షిణ ధ్రువం పై విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. భారత వైజ్ఞానిక సత్తాను ఇది ప్రపంచానికి చాటిచెప్పింది. దీంతో చంద్రుడి పై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకున్న తొలి దేశంగా రికార్డు సృష్టించింది. ఇండియా ప్రస్తుతం చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-4 ప్రయోగాన్ని 2027 లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
చంద్రయాన్-3 విజయం – భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయి!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరోసారి చరిత్ర సృష్టించింది! చంద్రయాన్-3 చంద్రుని పై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇది భారత అంతరిక్ష పరిశోధన రంగానికి గర్వకారణంగా మారింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది.
చంద్రయాన్-3 లక్ష్యాలు
చంద్రయాన్-3 మిషన్ ప్రత్యేక లక్ష్యాలను కలిగి ఉంది:
- చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం.
- చంద్రుని ఉపరితలంపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడం.
- చంద్రుని భూగర్భ నిర్మాణాన్ని విశ్లేషించడం, ఖనిజాల ఉనికిని గుర్తించడం.
చంద్రయాన్-3 ప్రయాణం
- 2023 జూలై 14: శ్రీహరికోట నుంచి ప్రయోగం.
- 2023 ఆగస్టు 5: చంద్రయాన్-3 చంద్రుని కక్ష్యలో ప్రవేశం.
- 2023 ఆగస్టు 23: చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతమైన ల్యాండింగ్.
విక్రమ్ ల్యాండర్ భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలోని చంద్రుని ఉపరితలంపై ప్రమాద రహితంగా దిగడం భారత్ విజయం అని నిరూపించింది.
ఇస్రో విజయం వెనుక టీమ్
ఈ ఘన విజయానికి ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు. ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ నాయకత్వంలో చంద్రయాన్-3 మిషన్ అత్యంత విజయవంతమైంది.