हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Tollywood : మంచి నీళ్లు అమ్ముతోన్న స్టార్ హీరోయిన్ …స్పెషల్ ఏంటో తెలుసా?

Divya Vani M
Tollywood : మంచి నీళ్లు అమ్ముతోన్న స్టార్ హీరోయిన్ …స్పెషల్ ఏంటో తెలుసా?

చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి, మొదట కొంత కష్టమైనా తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన భూమి పడ్నేకర్‌ (Bhumi Pednekar) గురించి తెలియని వారు ఎవరుంటారు? ఆమె తన నటనతోనే కాదు, అందంతోను అభిమానుల మనసు దోచుకుంది. ఇప్పుడు ఆమె తన కెరీర్‌లో మరో అడుగు వేసింది – అదే బిజినెస్ రంగం.ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటు వ్యాపారాలవైపు కూడా అడుగులు వేస్తున్నారు. సమంత, రష్మిక, దీపికా, అలియా లాంటి టాప్ హీరోయిన్స్ ఇప్పటికే ఎన్నో బిజినెస్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు భూమి పడ్నేకర్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.భూమి తన సోదరి సమీక్షా పడ్నేకర్‌తో కలిసి BackBay Aqua అనే ప్రీమియం వాటర్ బ్రాండ్‌ (BackBay Aqua, a premium water brand) ను ప్రారంభించారు. ఈ బ్రాండ్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ బాటిల్డ్ వాటర్ కాదు. హిమాలయాల నుంచి తీసిన నీటిని మినరల్స్, ఎలక్ట్రోలైట్స్‌తో కూడిన రూపంలో అందిస్తున్నారు.

Tollywood : మంచి నీళ్లు అమ్ముతోన్న స్టార్ హీరోయిన్ ...స్పెషల్ ఏంటో తెలుసా?
Tollywood : మంచి నీళ్లు అమ్ముతోన్న స్టార్ హీరోయిన్ …స్పెషల్ ఏంటో తెలుసా?

ధరలు ఎక్కువైనా, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ లేదు!

ఈ బ్రాండ్‌లో అరలీటర్‌ బాటిల్‌ ధర రూ.150, 750 మిల్లీ బాటిల్‌ ధర రూ.200. ‘అంత రేటా నీళ్లకు?’ అని చాలామందికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ఇందులో ఉపయోగించే నీటికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చూసి చాలామంది కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.ఈ రోజుల్లో చాలామంది ఎనర్జీ డ్రింక్స్‌పైనే ఆధారపడుతున్నారు. కానీ అవి శరీరానికి ఎంత వరకు మంచివో అనేది ఓ ప్రశ్న. అలాంటి సమయంలో ఈ హిమాలయ వాటర్‌ శరీరానికి సహజంగా అవసరమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తుంది. ఆరోగ్య పరిరక్షణకు ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.

ప్లాస్టిక్‌కు గుడ్‌బై – పర్యావరణ స్పృహతో డిజైన్‌

ఈ బ్రాండ్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే – బాటిల్స్ పూర్తిగా ప్లాస్టిక్‌ ఫ్రీగా ఉండటం. టోటల్‌గా పర్యావరణ హితంగా డిజైన్ చేశారు. బాటిల్ క్యాప్ కూడా భూమిలో కలిసిపోయేలా తయారు చేయడం గమనార్హం.భూమి ఈ వ్యాపారంపై మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. “నేను 17 ఏళ్ల వయసు నుంచే సంపాదిస్తున్నాను. అప్పటి నుంచే పొదుపు చేయడం అలవాటు. అదే డబ్బుతోనే ఈ బిజినెస్‌ స్టార్ట్ చేశాం” అని చెప్పింది.ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా పేరున్న భూమి, ఇప్పుడు ఒక విజన్‌తో ముందుకు వచ్చిన ఆంత్రప్రెన్యూర్‌గా మారుతోంది. ఆమె ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. నటనతో పాటు, బిజినెస్‌లోను స్టార్ అని నిరూపించుకుంది.

Read Also : AP – Telangana : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870