हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక

Divya Vani M
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ఈ టోర్నమెంట్‌కు 8 జట్లు పోటీపడుతుండగా, ఇప్పటికే 6 జట్లు తమ జట్లను ప్రకటించాయి.భారత్, పాకిస్థాన్ జట్లు మాత్రం ఇంకా తమ స్క్వాడ్‌ను వెల్లడించలేదు.టీమిండియా జట్టును జూన్ 18న అధికారికంగా ప్రకటించనున్నారు.టీమ్ ఇండియా ఎంపికపై భారీ ఆసక్తి నెలకొంది. డ్రెస్సింగ్ రూమ్ వివాదాలు, బీసీసీఐ విధించిన కఠిన నిబంధనలు క్రికెట్ ప్రపంచాన్ని కదిలించాయి.అభిమానులు, నిపుణులు, మీడియా ఈ అంశాలపై చర్చించుకుంటున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక

ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపికపై అందరి దృష్టి నిలిచింది.ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ మరియు దుబాయ్‌లో జరగనుంది.భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఏ ఆటగాళ్లు దుబాయ్‌కి వెళ్ళబోతున్నారనే ఉత్కంఠ మాండుతోంది.సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు తక్కువ ఫార్మ్‌లో ఉండగా, దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్ల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి.సీనియర్ సెలక్షన్ కమిటీ జనవరి 18న ముంబైలో సమావేశమవుతోంది.చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును తేల్చనున్నారు.

అయితే, ఆ రోజు జట్టును ప్రకటిస్తారా లేదా సమయం తీసుకుంటారా అనేది ఇంకా స్పష్టత లేదు.ఇంకా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయాల్ని సెలక్షన్ కమిటీ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కోచ్, కెప్టెన్, సెలక్టర్‌ల మధ్య ఉన్న విభేదాలు ఈ సమావేశానికి ప్రాధాన్యతను ఇస్తున్నాయి.ఈసారి సెలక్షన్ సమావేశం చాలా కీలకంగా మారనుంది. భారత జట్టులో కొత్త ముఖాలకు అవకాశముందా? సీనియర్లు మళ్లీ తుది జట్టులో స్థానం దక్కించుకుంటారా? అన్నవీ ఆసక్తికర ప్రశ్నలు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎవరు ఎంపికవుతారో ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870