Yuzvendra Chahal-IPL 2026: ఐపీఎల్ 2026 కోసం చాహల్ కఠిన నిర్ణయం

Read Time:  1 min
Yuzvendra Chahal-IPL 2026: ఐపీఎల్ 2026 కోసం చాహల్ కఠిన నిర్ణయం
FONT SIZE
GET APP

Yuzvendra Chahal-IPL 2026: టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ కీలక ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 35 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లకు పోటీనిచ్చేలా తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన చాహల్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Read Also: IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్

జట్టు కోసం 150 శాతం ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యం

‘నేను మద్యం మానేసి 6 నెలలకు పైగా అవుతుంది. ఇప్పుడు నా వయసు 35 ఏళ్లు. నేను మరింత ఫిట్‌గా ఉంటూ నా జట్టుకు 150 శాతం సహకారం అందించాలనుకుంటున్నా. ఒక సీనియర్ ఆటగాడిగా.. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాను. ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో మార్కో యాన్సెన్ లేకపోవడం మాకు నష్టం కలిగించింది. అతను ఉండి ఉంటే.. మేం కచ్చితంగా టైటిల్ గెలిచేవాళ్లం. టోర్నీ ఆసాంతం అతను బౌలింగ్, బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. అతని బౌలింగ్‌ను ఆడటం బ్యాటర్లకు కూడా అంత సులువు కాదు. ఇది మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

Yuzvendra Chahal-IPL 2026: Chahal's tough decision for IPL 2026
Yuzvendra Chahal-IPL 2026: Chahal’s tough decision for IPL 2026

అంతేగాక‌ గత సీజన్ చివరి దశలో తన ప్రదర్శన పట్ల కూడా నిరాశగా ఉన్నానని చాహల్ అంగీకరించాడు. “కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత నా పక్కటెముక విరిగింది. ఆ తర్వాత నా వేలికి కూడా ఫ్రాక్చర్ అయింది. ఆ గాయాల కారణంగా సెమీఫైనల్, ఫైనల్‌లో నా అసలైన లెగ్ స్పిన్ బౌలింగ్ చేయలేకపోయాను. అందుకే ఈ ఏడాది నా శరీరంపై పూర్తి శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను” అని చాహల్ స్పష్టం చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.