📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Yuzvendra Chahal: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..చాహల్ వ్యాఖ్యలు వైరల్

Author Icon By Anusha
Updated: August 1, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కేవలం తన బౌలింగ్ ప్రతిభతోనే కాకుండా, తన సరదా స్వభావం, మైదానంలో చూపే ఎనర్జీతో కూడా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. తన మాజి, భార్య ధనశ్రీ వర్మతో సంబంధాలు చేదుగా మారిన తర్వాత, తాను తీవ్ర మానసిక వేదనలోకి వెళ్లిపోయానని, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించానని యుజ్వీ తెలిపారు.చాహల్ (Yuzvendra Chahal) భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించడం, అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను తన మాయాజాల లెగ్ స్పిన్‌తో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు. ఇంతటి విజయాలు సాధించిన క్రికెటర్ వ్యక్తిగత జీవితంలో ఇంతటి కష్టాలను ఎదుర్కోవడం అభిమానులను కలచివేస్తోంది.

ప్రత్యేక కార్యక్రమంలో

చాహల్ 2020 డిసెంబర్‌లో డ్యాన్సర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మొదట్లో వారిద్దరి బంధం బలంగా, ఆనందంగా సాగినప్పటికీ, కాలక్రమేణా విభేదాలు తలెత్తాయి.వారిద్దరి మధ్య తలెత్తిన తీవ్ర సమస్యల కారణంగా యుజ్వేంద్ర చాహల్ గత మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల ప్రక్రియ, ఆ తర్వాత ఎదురైన పరిస్థితులు తనను ఎంతగానో కలచివేశాయని యుజ్వేంద్ర చాహల్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు.నా జీవితాన్ని తలుచుకుంటే నేను చాలా అలసిపోయాను. నాలో ఉత్సాహం పూర్తిగా చచ్చిపోయింది. చాలా సార్లు ఆత్మహత్య (suicide) చేసుకుందామని నిర్ణయించుకున్నాను” అని యుజ్వేంద్ర చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ కష్టకాలంలో తన దైనందిన జీవితం పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ రెండు గంటలు ఏడ్చేవాడినని.. రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోగలిగానని తన బాధను వ్యక్తం చేశాడు.

నిద్రలేమి కారణంగా ఆటపై కూడా తాను సరిగా దృష్టి పెట్టలేకపోయానని

ఇలా దాదాపు 40-45 రోజులు గడిచాయని, ఆ సమయంలో క్రికెట్ నుంచి పూర్తిగా విరామం తీసుకోవాలని కూడా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. నిద్రలేమి కారణంగా ఆటపై కూడా తాను సరిగా దృష్టి పెట్టలేకపోయానని అన్నాడు.ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినప్పుడు, తన సన్నిహిత స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకున్నానని చాహల్ చెప్పాడు. వారు తనకు అండగా నిలిచారని, మానసికంగా ధైర్యం చెప్పారని తెలిపాడు. ఆ సమయంలో జీవితంపై చాలా భయమేసిందని చాహల్ చెప్పుకొచ్చాడు. విడాకుల (Divorce) తర్వాత ప్రజల నుండి ఎదురైన ఆరోపణలు తనను మరింత బాధించాయని చాహల్ తెలిపాడు. “నేను నా భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు, చాలా మంది నేను ఆమెను మోసం చేశానని అన్నారు. అది నాపై వేసిన నిరాధార నింద. నేను ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నాకంటే నమ్మకమైన వ్యక్తిని మీరు ఎక్కడా చూడలేరు” అని ఆయన గట్టిగా ఖండించారు.

ఆడవారిని ఎలా గౌరవించాలో నాకు బాగా తెలుసు

తన వ్యక్తిత్వం గురించి వివరిస్తూ, “నా సన్నిహిత స్నేహితులకు నేను హృదయపూర్వకంగా ప్రేమను ఇస్తాను. నేను వారి నుండి దేన్నీ ఆశించను. చాలా మందికి నేను సహాయం చేస్తాను. నా గురించి సరిగ్గా తెలియని వారే ఈ విడాకుల విషయంలో నాపై నిందలు వేశారు” అని స్పష్టం చేశారు.ఇంకా, తన కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ, “నాకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారితోనే నేను చిన్నప్పటి నుండి పెరిగాను. ఆడవారిని ఎలా గౌరవించాలో నాకు బాగా తెలుసు. అలాగే నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు” అని తన పెంపకం విలువలను గుర్తు చేసుకున్నారు. తన పేరును అనేక విషయాల్లో లాగుతున్నారని, తన గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారనే ఉద్దేశ్యంతో కొందరు ఇలా చేస్తున్నారని చాహల్ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చాహల్ వ్యక్తిగత జీవితంలో ఎంతగా కుంగిపోయారో స్పష్టం చేస్తున్నాయి.

యుజ్వేంద్ర చాహల్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

చాహల్ జూలై 23, 1990న హర్యానాలోని జింద్‌లో జన్మించారు.

చాహల్ తన మానసిక ఆరోగ్యంపై ఏమన్నారు?

మానసిక సమస్యలు ఎదురైనప్పుడు సహాయం కోరడం తప్పు కాదని, ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చాహల్ సందేశం ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also : India vs England : బ్యాటింగ్‌లో తడబడ్డ భారత్‌.. ఆదుకున్న కరుణ్‌

Breaking News Chahal divorce Chahal suicide thoughts Dhanashree Verma Indian Cricket IPL Records latest news Yuzvendra Chahal Yuzvendra Chahal news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.