Yuzvendra Chahal: వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్

Read Time:  1 min
Yuzvendra Chahal: వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్
FONT SIZE
GET APP

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాడు. తాజాగా ఆయన పెట్టిన నో మనీ.. నో హనీ అనే క్యాప్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యుజ్వేంద్ర చాహల్ తన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో థాయ్‌లాండ్ ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. అంతవరకు బానే ఉన్నా, దానికి పెట్టిన క్యాప్షన్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Read Also: T20 WC: ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా

“No Money.. No Honey” (డబ్బు లేకపోతే ప్రియురాలు ఉండదు) అనే అర్థం వచ్చేలా ఎమోజీలతో సహా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వచ్చిన కొద్దిరోజుల ముందే ఆయనకు, ప్రముఖ ఆర్‌జే మహ్వాష్‌కు మధ్య గొడవ జరిగిందని, ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో చాహల్ (Yuzvendra Chahal)ఆమెనే టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టాడా? అని నెటిజన్లు అనుమానిస్తున్నారు.

ఒకప్పుడు టీమిండియాలో కీలక బౌలర్‌గా ఉన్న చాహల్, గత మూడేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు. సెలెక్టర్లు అతడిని వరుసగా విస్మరిస్తున్నారు. ఇప్పటివరకు చాహల్ 72 వన్డేల్లో 121 వికెట్లు, 80 టీ20ల్లో 96 వికెట్లు తీశాడు. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్నా, జట్టులో స్థానం దక్కించుకోవడం అతడికి కష్టంగా మారింది. ప్రస్తుతం ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో వ్యక్తిగత వివాదాలు అతడి కెరీర్‌పై ఏ ప్రభావం చూపుతాయో చూడాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.