📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Yuvraj Singh: యువరాజ్ సింగ్ తనయుడిని చూసారా?

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 2:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన కుటుంబంతో కలిసి తాజాగా ఓ ఈవెంట్‌లో సందడి చేశాడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ఒరియన్‌ (Orion) తో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నతనంలోనే క్రికెట్ అభిమానుల మనసు దోచిన యువీ, ఇప్పుడు తండ్రిగా తన బాధ్యతల్ని ఎంతో ప్రేమగా నిర్వహిస్తున్నట్టు ఈ ఫోటోల ద్వారా స్పష్టమవుతోంది.తండ్రి వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న జూనియర్ యువరాజ్ ను ఆ ఫొటోల్లో చూడొచ్చు. తండ్రీకొడుకులు ఇద్దరూ సూటూబూటూ వేసి డైనమిక్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటో షూట్ లో యువీ (Yuvraj Singh) ఆర్ధాంగి హేజెల్ కీచ్, కుమార్తె ఆరా కూడా పాల్గొన్నారు.

తన బిడ్డ

గతంలో ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ మాట్లాడుతూ,ఓరియన్ క్రికెటర్ కావాలని తాను కోరుకోవడం లేదని, ఒకవేళ అతడు క్రికెటర్ అవ్వాలనుకుంటే మాత్రం అడ్డుచెప్పబోనని స్పష్టం చేశాడు. ఓ తండ్రిగా, క్రికెటర్ గా తన బిడ్డ కూడా క్రికెటరే అవ్వాలని భావించడం సబబు కాదని, పెద్దయ్యాక వారి ఇష్టాయిష్టాలను అనుసరించి ప్రోత్సహించాలని యువీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. యువరాజ్, బాలీవుడ్ నటి హేజెల్ కీచ్ (Hazel Keech) ప్రేమలో పడి 2017 నవంబర్ 30న పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరికి తొలిసారిగా కుమారుడు జన్మించగా అతడికి ఓరియన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కుమార్తె జన్మించగా, ఆమెకు ఆరా అని పేరుపెట్టారు. 

Yuvraj Singh: యువరాజ్ సింగ్ తనయుడిని చూసారా?

జీవితం

క్యాన్సర్‌ను జయించి మళ్లీ క్రికెట్‌కు తిరిగొచ్చిన యువరాజ్ సింగ్, ఎంతో మంది అభిమానులకు స్పూర్తిగా నిలిచాడు. ఇప్పుడు కుటుంబ (Family) జీవితం ఆనందంగా గడుపుతూ, ఫ్యామిలీతో ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ, యువతకు మార్గనిర్దేశం చేస్తున్నాడు.

2008 నుండి 2018 వరకు ఐపీఎల్లో యువరాజ్ సింగ్ ఏ జట్టులో ఆడాడు?

యువరాజ్ సింగ్ 2008 నుండి 2019 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఇప్పుడు పంజాబ్ కింగ్స్), పూణే వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్), సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ వంటి వివిధ జట్లతో ఆడాడు.

2011 ప్రపంచ కప్లో యువరాజ్ సింగ్ గణాంకాలు?

2011 ప్రపంచ కప్ సందర్భంగా, యువరాజ్ సింగ్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి 90.50 సగటుతో 362 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో అతను 5.02 ఎకానమీ రేటును కొనసాగించి 15 వికెట్లు కూడా పడగొట్టాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Radhika Yadav: మహిళా టెన్నిస్ ప్లేయర్‌ రాధికా యాదవ్ ని కాల్చి చంపిన తండ్రి..కారణమిదే?

Breaking News Hazel Keech and Yuvraj Singh kids latest news Orion Yuvraj Singh latest pics Telugu News Yuvraj Singh daughter Aira Yuvraj Singh family photos Yuvraj Singh son Orion

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.