📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

YS Jagan: స్వర్ణ పతక విజేత.. రెడ్డి భవానిని అభినందించిన వైఎస్ జగన్

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత యువ వెయిట్‌లిఫ్టర్ రెడ్డి భవాని (Reddy Bhavani) అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ క్రీడా రంగంలో భారత్ పతాకాన్ని ఎగురవేసింది. కజకిస్థాన్ వేదికగా ఇటీవల ముగిసిన ఏషియన్ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భవాని రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలుచుకొని దేశగౌరవాన్ని మరింత పెంచింది. ఈ విజయం ఆమెకే కాక, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచింది.భవాని స్నాచ్ విభాగంలో (snatch section) 69 కిలోలు, అలాగే క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 90 కిలోలు లిఫ్ట్ చేస్తూ రెండింటిలోనూ బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఆమె క్రీడా రంగంలో సత్తా చాటింది. ఓ యువతిగా అంతర్జాతీయ వేదికపై ఇలా వెలుగు వెలగడం నిజంగా ప్రేరణగా నిలుస్తోంది.విజయనగరం జిల్లా, మండలం కొండకరకం గ్రామానికి చెందిన రెడ్డి భవాని అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. భవాని తండ్రి రెడ్డి ఆదినారయణ (Reddy Adi Narayana) తాపీ మేస్త్రీ. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, మొదటి అమ్మాయి పెళ్లి కోసం ఉన్న ఇళ్లు కూడా అమ్మేసాడు.

ఎక్స్‌ వేదికగా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు

అయినా వెనకడుగు వేయకుండా రెండో కుమార్తె భవానికి వెయిట్‌ లిఫ్టింగ్‌లో ట్రైనింగ్ ఇప్పించారు. అందరి ప్రోత్సాహంతో రెడ్డి భవాని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది.ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన వైఎస్ జగన్‌ (YS Jagan), ఎక్స్‌ వేదికగా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ‘ఏషియన్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన విజయనగరం జిల్లాకు చెందిన రెడ్డి భవానికి హృదయపూర్వక అభినందనలు. మరిన్ని మైలురాళ్లు, చిరస్మరణీయ విజయాలు ఆమెకు దక్కాలని కోరుకుంటున్నా. భవాని, ఇలాగే విజయాలతో మెరుస్తూ ఉండాలి.’అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

Read hindi news:

Read Also: Quantum Valley: క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ పార్టీకి చెందినవారు?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)కి చెందిన నేత.

ఆంధ్రప్రదేశ్ కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నవ ముఖ్యమంత్రి?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రి.అయితే, ఇది ఏకీకృత ఆంధ్రప్రదేశ్, విభజన అనంతర రాష్ట్రాన్ని కలిపి లెక్కించితే 17వ ముఖ్యమంత్రి అవుతారు.
విభజన అనంతర (2014 తర్వాత) ఆంధ్రప్రదేశ్‌లో ఆయన 2వ ముఖ్యమంత్రి.

AsianYouthChampionship Breaking News GoldMedalist latest news ReddyBhavani Telugu8 news WeightliftingChampion YSJagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.