📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Dhruv Jurel:వెస్టిండీస్‌తో టెస్టులో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తొలి సెంచరీ

Author Icon By Aanusha
Updated: October 3, 2025 • 9:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో మరో అద్భుత ఘట్టం నమోదైంది. యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) తన తొలి టెస్టు సెంచరీని కేవలం రన్స్ మైలురాయిగా కాకుండా, ఒక భావోద్వేగ క్షణంగా మార్చుకున్నాడు. అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌ (West Indies) తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్‌లో ఆయన అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ శతకాన్ని పూర్తి చేశారు. కానీ ఈ శతకం కేవలం రికార్డు మాత్రమే కాదు, ఒక దేశభక్తి గుర్తుగా మారింది.

ENG vs SAW : ఇంగ్లాండ్ స్పిన్నర్ల అద్భుత ప్రదర్శన

కార్గిల్ యుద్ధ యోధుడైన తన తండ్రికి ఆర్మీ శైలిలో గౌరవ వందనం చేసి, తన శతకాన్ని ఆయనకు అంకితమిచ్చి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. శుక్రవారం నాటి ఆటలో, 190 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన వెంటనే 25 ఏళ్ల జురెల్ తన బ్యాట్‌తో ఆర్మీ మార్చ్ డ్రిల్‌ను అనుకరిస్తూ సెల్యూట్ చేశాడు.

రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ అయిన తన తండ్రి నేమ్ చంద్‌కు ఈ విధంగా నివాళి అర్పించాడు. గాయపడిన రిషబ్ పంత్ (Rishabh Pant) స్థానంలో ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జురెల్, ఎంతో పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 210 బంతుల్లో 125 పరుగులు సాధించాడు.

Dhruv Jurel

భారత ఇన్నింగ్స్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్

రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో కలిసి ఐదో వికెట్‌కు 206 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.జురెల్ కంటే ముందు, భారత ఇన్నింగ్స్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకంతో గట్టి పునాది వేశాడు. చాలా కాలం తర్వాత స్వదేశంలో సెంచరీ చేసిన రాహుల్, తన సంబరాలను ఈ ఏడాది మార్చిలో జన్మించిన తన కుమార్తె ఇవారాకు అంకితమిచ్చాడు.

“ఈ సెంచరీ నా కుమార్తె కోసమే” అని ఆట ముగిశాక రాహుల్ (KL Rahul) వెల్లడించాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన తాను, సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా బరిలోకి దిగినట్లు తెలిపాడు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి

జురెల్ (125), రాహుల్ (శతకం) అద్భుత ప్రదర్శనకు తోడు రవీంద్ర జడేజా (104 నాటౌట్) కూడా సెంచరీతో కదం తొక్కడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో వెస్టిండీస్‌పై 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ (9*) క్రీజులో ఉన్నాడు. భారత బ్యాటర్ల ధాటికి విండీస్ బౌలర్లు తేలిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Dhruv Jurel Father Army Dhruv Jurel Kargil Warrior Son Dhruv Jurel Salute Celebration Dhruv Jurel Test Century India vs West Indies Test Match latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.