📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Latest News: Abhishek Sharma: యువ సంచలనం అభిషేక్ శర్మ కొత్త రికార్డు

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసియా కప్‌లో అసాధారణ ప్రదర్శనతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాడు. దూకుడు బ్యాటింగ్‌కి పేరుగాంచిన ఈ యువకుడు, ప్రస్తుత ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టీ20 టోర్నీలో రికార్డుల వేట మొదలెట్టాడు. వరుసగా తానే సృష్టించిన రికార్డులను అధిగమిస్తూ, ఈ సీజన్‌లో ఒక్క ఎడిషన్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలవడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు.

Asia Cup 2025: వారి వల్లే ఈ ఓటమి: శ్రీలంక కెప్టెన్

Abhishek Sharma

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టీ20 టోర్నీలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఓపెనింగ్ నుంచి జట్టుకు మంచి ఆరంభాన్ని అందిస్తున్నాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో కూడా అతని దూకుడు కొనసాగుతూ ఉండటం భారత జట్టు స్కోరును గగనానికి చేర్చేలా మారింది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఈ విధ్వంసకర ఓపెనర్ కేవలం 23 బంతుల్లోనే అర్థశతకం సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ ఇన్నింగ్స్ అతని కెరీర్‌లో మరో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్ శర్మ 309* పరుగులు చేశాడు. ఆసియా కప్ టీ20 టోర్నీ చరిత్రలో సింగిల్ ఎడిషన్‌లో ఓ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. అంతేకాకుండా ఈ టీ20 టోర్నీలో 300 పరుగులు చేసిన తొలి ప్లేయర్ కూడా అభిషేక్ శర్మనే. ఈ క్రమంలో అతను పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (Muhammad Rizwan) (281) రికార్డ్‌ను అధిగమించాడు.

అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ

ఈ జాబితాలో అభిషేక్ శర్మ(309*), మహమ్మద్ రిజ్వాన్(281), విరాట్ కోహ్లీ(276), ఇబ్రహీమ్ జడ్రాన్(5 ఇన్నింగ్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఒక టీ20 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (Virat Kohli)(319) ముందున్నాడు. టీ20 ప్రపంచకప్ 2014లో కోహ్లీ 6 ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేశాడు. ఈ రికార్డ్‌ను అభిషేక్ శర్మ అధిగమించే అవకాశం ఉంది.

అతితక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ

టీ20 క్రికెట్‌ (T20 Cricket) లో అతితక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ రికార్డ్‌ను అభిషేక్ శర్మ సమం చేశాడు. ఈ ఇద్దరు చెరో 6 సార్లు తక్కువ బంతుల్లో(25 బంతుల్లోపు) హాఫ్ సెంచరీ నమోదు చేశారు.ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్(7 సార్లు) టాప్‌లో ఉండగా..

రోహిత్, అభిషేక్ శర్మ(6) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20ల్లో వరుసగా అత్యధిక 30 ప్లస్ స్కోర్ నమోదు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మను అభిషేక్ శర్మ సమం చేశాడు. మహమ్మద్ రిజ్వాన్, రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ వరుసగా 7 సార్లు 30+ రన్స్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

300 runs milestone abhishek sharma Breaking News highest runs in single edition india cricket latest news record-breaking innings t20 asia cup 2025 Telugu News young cricketer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.