📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

Latest News: Yograj Singh – భారత పేసర్ల గాయాలపై యోగ్‌రాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు!

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 10:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో వేగం, ఫిట్నెస్ అనేవి ముఖ్యమైన అంశాలుగా మారిన ఈ రోజుల్లో, అదే ఫిట్నెస్ ప్రాక్టీసులు క్రీడాకారుల (Practices of athletes) పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయా? అన్న చర్చ చెలరేగుతోంది. ఈ చర్చకు నాంది పలికిన వ్యక్తి, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yograj Singh) తండ్రి, ప్రముఖ క్రికెట్ కోచ్ యోగ్‌రాజ్ సింగ్.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన టీమిండియా ఫాస్ట్ బౌలర్ల తరచూ గాయపడటంపై గట్టిగా స్పందించారు. ప్రత్యేకంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తరచూ గాయాలపాలవ్వడానికి కారణాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “బుమ్రా కేవలం రెండు మూడు గాయాలకే కాదు, గత కొన్ని సీజన్లలో అనేక సార్లు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. దీని వెనుక ప్రధాన కారణం అతని జిమ్ అలవాట్లు, బాడీ బిల్డింగ్‌పై చూపుతున్న అత్యధిక శ్రద్ధ” అని ఆయన వ్యాఖ్యానించారు.

Yograj Singh

బుమ్రా వంటి కీలక బౌలర్లు

శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి జిమ్‌లకు బదులుగా సాంప్రదాయ వ్యాయామ పద్ధతులను అనుసరించాలని యోగ్‌రాజ్ సూచించారు. “ఫాస్ట్ బౌలర్లు యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. ఇవి శరీరాన్ని సహజంగా బలోపేతం చేస్తాయి. కండరాలను దృఢంగా మార్చి, గాయాల ముప్పును తగ్గిస్తాయి” అని ఆయన వివరించారు. బుమ్రా వంటి కీలక బౌలర్లు తమ ఫిట్‌నెస్‌ (Fitness) ను జిమ్‌లలో కాకుండా సహజ సిద్ధమైన మార్గాల్లో పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

బుమ్రాతో పాటు మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్య వంటి కీలక ఆటగాళ్లు కూడా తరచూ గాయాలతో జట్టుకు దూరం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగ్‌రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు గాయాల (World-class bowlers injured) బెడద లేకుండా ఉంటే భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-ipl-teams-can-also-beat-pakistan-former-cricketer/national/549931/

body building impact on fast bowlers Breaking News gym workouts and injuries injuries in cricket jasprit bumrah injury issues latest news team india fast bowlers Telugu News yograj singh comments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.