టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో చర్చకు కారణమయ్యాయి. తన కుమారుడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కెరీర్‌కి సంబంధించిన విషయాలను ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చర్చిస్తూ, మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సహా పలువురు సహచర ఆటగాళ్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
IND vs AUS: ఆఖరి వన్డేలో టాస్ ఓడిన టీమిండియా
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు ఎవరనే ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వివాదాస్పద విషయాలు వెల్లడించారు. “విజయం, డబ్బు, కీర్తి ఉన్నచోట నిజమైన స్నేహితులు ఉండరు. వెన్నుపోటు పొడిచేవారే ఎక్కువగా ఉంటారు.
యువరాజ్‌కు జట్టులో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) మాత్రమే నిజమైన స్నేహితుడు” అని ఆయన పేర్కొన్నారు.ధోనీ, కోహ్లీలపై విరుచుకుపడుతూ, “యువరాజ్ సింగ్ అంటే అందరికీ భయం. దేవుడు సృష్టించిన గొప్ప ఆటగాడు అతను.
అందరూ తమ స్థానాల గురించి భయపడ్డారని
ఎంఎస్ ధోనీ (MS Dhoni) సహా ప్రతి ఒక్కరూ ‘ఓహ్, ఇతను నా కుర్చీని (స్థానాన్ని) లాక్కుంటాడేమో’ అని భయపడ్డారు” అని యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) ఆరోపించారు. యువరాజ్ కెరీర్ చివరి దశలో కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ (Virat Kohli) సహాయం చేయలేకపోయాడని, ఎందుకంటే అందరూ తమ స్థానాల గురించి భయపడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు.ఇక అత్యుత్తమ క్రికెటర్ ఎవరనే ప్రశ్నకు,
“ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే కపిల్ దేవ్ (Kapil Dev) అత్యుత్తమ ఆటగాడు. బ్యాట్స్‌మన్‌లలో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నా, నా దృష్టిలో వారందరి కంటే యువరాజే గొప్పవాడు.
అతనికి సరైన అవకాశాలు వచ్చి ఉంటే, సుమారు 200 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 200 సెంచరీలు సాధించే సత్తా ఉండేది” అని అన్నారు. గతంలో కూడా పలుమార్లు ధోనీపై విమర్శలు చేసిన యోగ్‌రాజ్ (Yograj Singh), తాజా వ్యాఖ్యలతో మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: