📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Yash Dayal: లైంగిక ఆరోపణల పై క్లారిటీ ఇచ్చిన ఆర్‌సీబీ పేసర్

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విజయాన్ని అందించిన పేసర్ యశ్ దయాల్ ఇప్పుడు వ్యక్తిగత వివాదంలో చిక్కుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, అలాగే యశ్ (Yash Dayal) చేసిన ఎదురు ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.అసలు విషయం ఏంటంటే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఓ యువతి ఆరోపణలు చేయగా, అసలు ఆమె ఒక దొంగ అని, తన డబ్బు, వస్తువులు కాజేసిందని యశ్ దయాల్ ఎదురు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఘజియాబాద్‌ (Ghaziabad) కు చెందిన ఓ యువ‌తి ఫిర్యాదు మేర‌కు యశ్ దయాల్‌పై ఆదివారం ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 69 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి పేరుతో నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

తీవ్రంగా స్పందించాడు

ఐదేళ్లుగా తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, ఈ విషయంపై జూన్ 21న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా ఐజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.ఈ ఆరోపణలపై యశ్ దయాల్ తీవ్రంగా స్పందించాడు. ప్రయాగ్‌రాజ్‌లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆయన సదరు మహిళపై ఎదురు ఫిర్యాదు చేశాడు. 2021లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె పరిచయమైందని, అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నామని తెలిపాడు. తన ఐఫోన్, లాప్‌టాప్ (Laptop) దొంగిలించిందని ఆయన ఆరోపించాడు. అంతేకాకుండా తన కుటుంబానికి, తనకు వైద్య చికిత్సల పేరుతో లక్షలాది రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేదని పేర్కొన్నాడు.

న్యాయపరంగా

షాపింగ్ కోసం కూడా పలుమార్లు డబ్బు తీసుకుందని, వీటన్నింటికీ తన వద్ద ఆధారాలున్నాయని యశ్ దయాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఘజియాబాద్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారని తెలిసిన తర్వాతే తాను న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు యశ్ దయాల్ తెలిపాడు. సదరు మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు (Family members) ఇద్దరిపై, మరికొందరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తన మూడు పేజీల ఫిర్యాదులో కోరాడు.

యశ్ దయాల్ ఆదర్శంగా భావించే ఆటగాడు ఎవరు?

యశ్ దయాల్‌కి క్రికెట్‌లో ఆదర్శం (Idol) అయిన ఆటగాడు భారత మాజీ ఎడమచేతి వేగం బౌలర్ జహీర్ ఖాన్ (Zaheer Khan).

యశ్ దయాల్ వేగం ఎంత?

యశ్ దయాల్‌ తాను సాధారణంగా 135 కిలోమీటర్లు/గంట (kmph) వేగంతో బౌలింగ్ చేస్తాడని అనుకుంటూ ఉండేవాడని చెప్పాడు. కానీ తరువాతి అనుభవాలు అతని వేగంపై స్పష్టత ఇచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Virat Kohli: రవి శాస్త్రి లేకుంటే టెస్ట్ క్రికెట్‌లో నేను లేను :కోహ్లీ

CounterComplaint GhaziabadPolice InstagramConnection latest news latset news Telugu News YashDayal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.