📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Yash Dayal: RCB పేస‌ర్ యశ్ దయాల్‌పై మరో కేసు నమోదు.. పూర్తివివరాలు ఇవే

Author Icon By Anusha
Updated: July 25, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో ఆర్సీబీ జట్టు తరఫున అద్భుతమైన బౌలింగ్ జట్టుకు విజయాన్ని అందించిన స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు వరుస చిక్కులు ఎదురవుతున్నాయి.ఇటీవల ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) కు చెందిన ఓ యువతి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌కు చెందిన మరో యువతి యశ్‌పై శారీరక, మానసిక వేధింపుల ఆరోపణలు చేస్తూ సంచలనం రేపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.బాధితురాలి ఫిర్యాదు ప్రకారం – మొదటిసారిగా జైపూర్‌లో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంలో తాను యశ్ దయాల్‌ (Yash Dayal) ను కలిసినట్లు పేర్కొంది. క్రికెట్‌లో కెరీర్‌కి మార్గదర్శకత ఇస్తానని నమ్మించి, సలహాల పేరుతో సీతాపూర్‌లోని ఓ హోటల్‌కు పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అంతటితో ఆగకుండా, తర్వాత రెండేళ్ల పాటు బ్లాక్‌మెయిల్ చేస్తూ పలు సందర్భాల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పేర్కొంది.

జీవిత ఖైదు

లైంగిక వేధింపులు మొద‌లైన‌ప్పుడు ఆ అమ్మాయి వయ‌సు 17 ఏళ్లు కావ‌డంతో పోక్సో చ‌ట్టం కింద య‌శ్ ద‌యాళ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే క్రికెట‌ర్‌కు క‌నీసం 10 ఏళ్లు లేక‌పోతే జీవిత ఖైదు ప‌డే అవ‌కాశం ఉంది.ఇది కేవలం క్రిమినల్ కేసు మాత్రమే కాకుండా, అతడి క్రికెట్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కేసుతో పాటు ఇప్పుడు రాజస్థాన్ (Rajasthan) కేసు కూడ ఉండడంతో, యశ్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.బీసీసీఐ, ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ క్రికెట్ వర్గాల్లో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఇలాంటి ఆరోపణలు ఆటగాడి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా, మొత్తం జట్టు ప్రతిష్టను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది.

Yash Dayal: RCB పేస‌ర్ యశ్ దయాల్‌పై మరో కేసు నమోదు.. పూర్తివివరాలు ఇవే

ఫైనల్ మ్యాచ్‌

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో ఆర్సీబీ (RCB) జట్టు కప్పు గెలవడానికి ప్రధాన కారణాలలో ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ఒకరు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవకముందే, అతనిపై వరుసగా లైంగిక ఆరోపణలు వెలువడ్డాయి.ఇప్పటికే యువతులపై మోసం, అత్యాచార ఆరోపణలతో క్రికెటర్ల పేర్లు ఆరోపణల్లో నిలబడిన సందర్భాలు ఉన్నా – యశ్ దయాల్‌పై ఒకేసారి రెండు రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం విషయంలో ఇది ఒక అరుదైన ఉదంతంగా చెప్పవచ్చు.

యశ్ దయాల్ ఎవరు?

యశ్ దయాల్ (జన్మ 13 డిసెంబర్ 1997, అలహాబాద్, ఉత్తరప్రదేశు), భారతదేశపు క్రికెటర్. ఆయ‌న ప్రధానంగా ఉఁతర్ ప్ర‌దేశ్ జ‌ట్టులో డొమిస్టిక్‌గా ఆడుతుంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రస్తుతం Royal Challengers Bengaluru (RCB) తరుపున పేస్ బౌలింగ్ చేస్తున్నారు.

యశ్ దయాల్ కెరీర్‌ ఏంటి?

యశ్ దయాల్ ఒక యువ,-left-arm fast-medium పేసర్, RCB తరుపున IPLలో ప్రముఖ ఆటగాడిగా ఎదుగుతూ ఉన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Shardul Thakur: గిల్ కెప్టెన్సీపై శార్దూల్ ఏమన్నారంటే?

blackmail Breaking News IPL 2025 Jaipur IPL match latest news mental harassment POCSO case Rajasthan girl complaint RCB bowler sexual assault allegations Sitapur hotel incident Telugu News Yash Dayal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.