Latest News: WWC 2025: డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన ఉమెన్స్ వరల్డ్ కప్

Read Time:  1 min
WWC 2025
WWC 2025
FONT SIZE
GET APP

ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌ (WWC 2025) క్రికెట్ ప్రపంచంలో కొత్త చరిత్రను రాసింది. ఆట మైదానంలో భారత మహిళా జట్టు అందించిన అద్భుత ప్రదర్శన మాత్రమే కాదు, ఆ టోర్నీని వీక్షించిన ప్రేక్షకుల సంఖ్య కూడా రికార్డులను బద్దలు కొట్టింది.

ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ జియో హాట్‌స్టార్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ వరల్డ్ కప్‌ను మొత్తం 446 మిలియన్ల మంది వీక్షించారు. ఇది మహిళా క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు లేని ఘనతగా నిలిచింది.

Read Also: T20 Finale: గబ్బాలో తుది పోరు: భారత్ సిరీస్ గెలుపు దిశగా!

WWC 2025
WWC 2025

చరిత్ర సృష్టించిన ఉమెన్స్ వరల్డ్ కప్

హాట్‌స్టార్ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం, గత మూడు ఉమెన్స్ వరల్డ్ కప్‌ (WWC 2025)లను కలిపినా వచ్చిన వ్యూయర్‌షిప్ కంటే ఈసారి వచ్చిన సంఖ్య అధికంగా ఉందని తెలిపారు.

ముఖ్యంగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ను 185 మిలియన్ల మంది వీక్షించారని పేర్కొన్నారు. ఈ సంఖ్య 2024 మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌తో సమానమని హాట్‌స్టార్ వెల్లడించింది. అంటే మహిళా క్రికెట్ ప్రాచుర్యం పురుషుల క్రికెట్ స్థాయిలో చేరినట్లే అని చెప్పవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.