📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Wriddhiman Saha: 20 బంతుల్లో చరిత్ర సృష్టించిన సాహా!

Author Icon By Radha
Updated: October 21, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) తన దేశీయ కెరీర్‌లో అద్భుత ఘనత సాధించాడు. 2018లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(Cricket Association of Bengal) (CAB) నిర్వహించిన టి20 టోర్నమెంట్‌లో మోహన్ బగాన్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన సాహా, కేవలం 20 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 14 సిక్సర్లు, 4 ఫోర్లు బాదుతూ మొత్తం 102 పరుగులు సాధించాడు.

Read also:  Mirage: సోనీ లైవ్‌లో ‘మిరాజ్ మూవీ రివ్యూ

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. సాహా సెంచరీ సహాయంతో మోహన్ బగాన్ జట్టు 152 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7 ఓవర్లలోనే ఛేదించి, 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టీమిండియా కెరీర్‌లో సాహా ప్రయాణం

2010లో భారత జట్టులోకి అడుగుపెట్టిన వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha), మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో 1353 పరుగులు సాధించాడు. వన్డేల్లో మాత్రం అతనికి అదృష్టం కలిసిరాలేదు — 9 మ్యాచ్‌ల్లో కేవలం 41 పరుగులే చేశాడు. 2014 తర్వాత వన్డే జట్టులో అవకాశం రాకపోవడంతో, చివరికి 2021 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. 2025లో సాహా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి, ఇప్పుడు బెంగాల్ అండర్-23 జట్టు కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

సాహా పేరు రికార్డుల్లో శాశ్వతం

వృద్ధిమాన్ సాహా చేసిన ఈ 20 బంతుల సెంచరీ ఇప్పటికీ భారత దేశీయ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీగా గుర్తించబడుతోంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో కాకపోయినా, దేశీయ క్రికెట్‌లో ఇది విస్మయకర ఘనతగా నిలిచిపోయింది.

వృద్ధిమాన్ సాహా ఎంత బంతుల్లో సెంచరీ సాధించాడు?
కేవలం 20 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

ఈ రికార్డు ఏ మ్యాచ్‌లో జరిగింది?
2018లో మోహన్ బగాన్ vs బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్ మ్యాచ్‌లో.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

20 balls Fastest Century Indian Cricket latest news Wriddhiman Saha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.