📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

WPL 2026: మరికాసేపట్లో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం

Author Icon By Aanusha
Updated: January 9, 2026 • 6:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. నేటి నుంచి విమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ (WPL 2026) ఘనంగా ప్రారంభం కానుంది. నేడు అంటే జనవరి 9, శుక్రవారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ వేడుకలు జరగనున్నాయి. రాత్రి 7:30 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Read Also: Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

దీనికంటే సరిగ్గా ఒక గంట ముందు, అంటే సాయంత్రం 6:30 గంటలకు మెరిసే కాంతుల మధ్య ఓపెనింగ్ సెరిమనీ మొదలవుతుంది.ఈ సారి ఓపెనింగ్ సెరిమనీని బీసీసీఐ చాలా స్పెషల్ గా ప్లాన్ చేసింది. ప్రముఖ సింగర్ యో యో హనీ సింగ్ తన పాపులర్ పాటలతో స్టేడియంలో జోష్ నింపనున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అలరించనుంది. విశేషమేమిటంటే, మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కూడా ఈ వేడుకలో మెరవనున్నారు. దీంతో క్రికెట్ గ్రౌండ్ అంతా సెలబ్రిటీల వెలుగులతో నిండిపోనుంది.

ఎక్కడచూడొచ్చంటే?

అద్భుతమైన వేడుకను, మ్యాచ్‌లను అభిమానులు టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‎లో వీక్షించవచ్చు. ఒకవేళ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో చూడాలనుకుంటే జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.ఈ సీజన్‌లో మొత్తం ఐదు జట్లు – ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,

ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడనున్నాయి. మొత్తం 22 మ్యాచ్‌లు జరగనుండగా, లీగ్ మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగుతాయి. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు వడోదరలోని కోటాంబి స్టేడియంలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ గ్రాండ్ టోర్నీకి ముగింపు పలకనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Navi Mumbai Telugu News women cricket India Womens Premier League WPL season 4

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.