ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో జరగనుంది. ఈ మెగా వేలం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ (Star Sports) వేదికగా వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొనే ఈ లీగ్‌లో 73 స్థానాల కోసం వేలం జరగనుంది. మొత్తంగా ఈ వేలం కోసం 277 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.
Read Also: Sports : విద్యతోపాటు క్రీడా స్పూర్తి అవసరమే
వేలంలో కొనుగోలు
ఇక మొత్తం రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్లలో 194 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో 52 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. 142 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే.. 66 మంది విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 17 మంది విదేశీ అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి.. మొత్తంగా 23 మంది ఆటగాళ్లను ఈ వేలంలో కొనుగోలు చేయనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: