WPL 2026: ఓటమి పై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఏమన్నారంటే?

Read Time:  1 min
WPL 2026: ఓటమి పై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఏమన్నారంటే?
FONT SIZE
GET APP

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 (WPL 2026) ఫైనల్లో ఓటమి ఎదురైనా తమ జట్టు ప్రదర్శనపై పూర్తి గర్వంగా ఉన్నానని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ వ్యాఖ్యానించింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ, టైటిల్ గెలవలేకపోయినా జట్టు ఆటగాళ్ల కృషి, పోరాట స్ఫూర్తి ప్రశంసనీయమని తెలిపింది.దురదృష్టవశాత్తు ఆశించిన ఫలితం దక్కలేదని పేర్కొంది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని తెలిపింది.మా సీనియర్ ఆటగాళ్లు కూడా అద్భుతంగా పుంజుకున్నారు. నందిని అద్భుతంగా రాణించింది.

Read Also: Smriti Mandhana: WPL 2026 విజేతగా RCB

WPL 2026: What did the Delhi Capitals captain say about the defeat?
WPL 2026: What did the Delhi Capitals captain say about the defeat?

శ్రీ చరణి తీవ్రంగా నిరాశపర్చింది

మేం ఆమె నుంచి ఆశించిన దాని కంటే ఎక్కువే చేసింది. మిన్ను కూడా చాలా బాగా ఆడింది. అంతా అద్భుతంగా సాగింది.’అని జెమీమా రోడ్రిగ్స్ చెప్పుకొచ్చింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా(37 బంతుల్లో 8 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించగా.. లారా వోల్వర్డ్ట్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), చినెల్ హెన్రీ(15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడారు.

ఆర్‌సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే(1/46), అరుంధతి రెడ్డి(1/40), నదినే డీ క్లెర్క్(1/48) తలో వికెట్ తీసారు.అనంతరం ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి గెలుపొందింది. జార్జియో వాల్(54 బంతుల్లో 14 ఫోర్లతో 79), స్మృతి మంధాన(41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చినెల్ హెన్రీ(2/34) రెండు వికెట్లు తీయగా.. నందని శర్మ, మిన్ను చెరో వికెట్ పడగొట్టారు. తెలుగు తేజం శ్రీ చరణి(0/46) తీవ్రంగా నిరాశపర్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.