📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: WPL 2026 Retentions: డబ్ల్యూపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్ విడుదల

Author Icon By Aanusha
Updated: November 7, 2025 • 6:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వన్డే ప్రపంచకప్ 2025 విజయంతో భారత మహిళల క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది. అర్థ శతాబ్దపు కలను సాకారం చేసుకుంది. భారత అమ్మాయిల విజయం వెనుక వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) పాత్ర కూడా ‌ఉంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న డబ్ల్యూపీఎల్.. నాలుగో సీజన్ కోసం సమాయత్తమవుతుంది. ప్రపంచకప్ విజయం నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్‌కు ప్రేక్షకాదరణ మరింత రెట్టింపు కానుంది.

Read Also: Michelle Marsh: ఓటమి పై ఆసీస్ కెప్టెన్ ఏమన్నారంటే?

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 (WPL 2026 Retentions) సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ లిస్ట్ విడుదలైంది. నవంబర్ 6, గురువారం రిటెన్షన్ గడువు ముగియడంతో అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. ఈసారి రిటెన్షన్స్‌లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా ఇటీవలి మహిళల ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‎గా నిలిచిన దీప్తి శర్మతో పాటు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ను కూడా వారి వారి జట్లు విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. డబ్ల్యూపీఎల్ 2026 (WPL 2026 Retentions) మెగా వేలం ఈ నెలాఖరు (నవంబర్ 27)లో జరగనుంది. 

రిటెన్షన్ రూల్స్ ప్రకారం ప్రతి జట్టు

ఈ మెగా వేలం రిటెన్షన్ రూల్స్ ప్రకారం ప్రతి జట్టు గరిష్టంగా ఐదుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో గరిష్టంగా ముగ్గురు భారత క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు ఫారిన్ ప్లేయర్లు, ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వేలం పర్స్ వాల్యూను రూ. 15 కోట్లుగా నిర్ణయించారు.

ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‎గా నిలిచిన దీప్తి శర్మతో పాటు, సౌతాఫ్రికాను ఫైనల్ వరకు తీసుకెళ్లిన లారా వోల్వార్ట్, ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) ను ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ మెగ్ లానింగ్‎లను వారి జట్లు విడుదల చేయడం గమనార్హం.ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్ల చొప్పున రిటైన్ చేసుకున్నాయి.

WPL 2026 Retentions

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నలుగురు ఆటగాళ్లను

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నలుగురు ఆటగాళ్లను, గుజరాత్ జెయింట్స్ ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, యూపీ వారియర్స్ కేవలం ఒక్కే ఒక్క ప్లేయర్‎ను మాత్రమే అట్టిపెట్టుకుంది. ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, వారికి కేటాయించిన సొమ్ము వివరాలు తెలుసుకుందాం.

ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ.2.5 కోట్లు), హీలీ మాథ్యూస్ (రూ.1.75 కోట్లు), నట్-సైవర్ బ్రంట్ (రూ.3.5 కోట్లు)తో సహా ఐదుగురిని రిటైన్ చేసుకుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రపంచకప్ అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే ఇంగ్లాండ్ క్రికెటర్ నట్ సైవర్-బ్రంట్‌కే ఎక్కువ ధర కేటాయించారు.

మెగ్ లానింగ్‌ను రిలీజ్ చేసిన ఢిల్లీ

మెగ్ లానింగ్‌ను రిలీజ్ చేసిన ఢిల్లీ.. ఎనాబెల్ సదర్లాండ్, మారిజన్నె కాప్, జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, నిక్కీ ప్రసాద్ లను రిటైన్ చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధాన (రూ.3.5 కోట్లు), ఎలిస్ పెర్రీ (రూ.2 కోట్లు), రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్ లను అట్టిపెట్టుకుంది.

ఈ మెగా వేలం ప్రక్రియ నవంబర్ 27, 2025న నిర్వహించనున్నట్లు సమాచారం. జట్లకు ఆర్టీఎం (Right to Match) కార్డుల విషయంలో పెద్ద తేడాలు ఉన్నాయి. ఆర్టీఎం కార్డులు ఏ జట్టుకు అందుబాటులో లేవు. గతంలో ఉన్న నియమం ప్రకారం.. యూపీ వారియర్స్ 4 ఆర్టీఎం కార్డులతో, గుజరాత్ జెయింట్స్ 3 ఆర్టీఎం కార్డులతో, ఆర్‌సీబీ 1 ఆర్టీఎం కార్డుతో వేలంలోకి దిగనున్నాయి.

ఎంఐ, డీసీలకు మాత్రం ఎలాంటి ఆర్టీఎం కార్డులు అందుబాటులో లేవు. డబ్ల్యూపీఎల్ చరిత్రలో మొదటిసారి ముంబై ఇండియన్స్, రెండోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మూడోసారి (2025) మళ్లీ ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

latest news Telugu News Women’s Premier League WPL 2026 Retentions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.