మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్‌లో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ విజయం సాధించింది. సోమవారం వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 61 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ ఘన విజయంతో మంధాన సేన ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
Read Also: IND vs NZ: సంజయ్ మంజ్రేకర్‌పై వికాస్ కోహ్లీ వ్యంగ్యాస్త్రాలు
కీలక భాగస్వామ్యం
బ్యాటింగ్‌లో గౌతమి నాయక్(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 73) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బౌలింగ్‌లో సయాలి సత్ఘరే(3/21) మూడు వికెట్లతో గుజరాత్ జెయింట్స్ పతనాన్ని శాసించింది.టాస్ ఓడిన ఆర్సీబీకి షాకిస్తూ గుజరాత్ జెయింట్స్ బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీసినా ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్(1)ను మొదటి ఓవర్లోనే రేణుకా సింగ్ వెనక్కి పంపింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డేంజరస్ జార్జియా వోల్(1)ను కష్వీ గౌతమ్ క్లీన్ బౌల్డ్ చేసింది.
దాంతో.. పరుగులకే ఆర్సీబీ విధ్వంసక ప్లేయర్లు డగౌట్ చేరారు. అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన(26), గౌతమీ నాయక్(73) లు కీలక భాగస్వామ్యం నిర్మించారు. మంధానను ఎల్బీగా ఔట్ చేసిన గార్డ్‌నర్ ఈ ఈ జోడీని గార్డ్‌నర్ విడదీసింది.ఆ తర్వాత రీచా ఘోష్(27) జతగా ఆర్సీబీ స్కోర్ బోర్డును నడిపించిన గౌతమి హాఫ్ సెంచరీ సాధించింది. కాసేపటికే రీచా పెద్ద షాట్ ఆడబోయి బౌండరీ వద్ద గార్డ్‌నర్ చేతికి క్యాచ్ ఇచ్చింది.
అనంతరం రాధా యాదవ్(17) డెవినె ఓవర్లో భారీ సిక్సర్‌తో స్కోర్ 160 దాటింది. కష్వీ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతినే కవర్స్‌లో రాధ బౌండరీకి పంపింది. రెండో బంతికి ఫోర్ బాదిన తను ఔటయ్యాక వచ్చిన శ్రేయాంక పాటిల్(8 నాటౌట్) స్వీప్ షాట్‌తో ఫోర్ సాధించగా 17 రన్స్ వచ్చాయి. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 కొట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: