మహిళల ప్రిమియర్ లీగ్ 2026 (WPL 2026) సీజన్‌లో, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్స్ బెర్తు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో, టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుని, ముంబయిని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ వడోదరలో జరుగుతోంది.నాలుగో సీజన్ ఆరంభ పోరులో ముంబైపై ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గెలుపొందిన ఆర్సీబీ.. ఐదు విజయాలతో నాకౌట్‌కు చేరింది. కానీ, హర్మన్‌ప్రీత్ కౌర్ సేన మాత్రం ఢిల్లీని ఓడించి బోణీ కొట్టినా.. ఆపై చతికిలపడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మెరుపులతో గుజరాత్‌కు షాకిచ్చిన ముంబై రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
Read Also: Pakistan T20 World Cup : జట్టే ప్రకటించారు, అయినా పాక్ ఆడుతుందా? సస్పెన్స్!
ముంబై ఇండియన్స్ తుది జట్టు : సంజీవన సంజన, హీలీ మాథ్యూస్, నాట్‌సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కేర్, రహిలా ఫిర్దౌస్(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, వైష్ణవీ శర్మ, షబ్నం ఇస్మాయిల్, పూనమ్ ఖెమ్నర్.
ఆర్సీబీ తుది జట్టు : గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన(కెప్టెన్), జార్జియా వోల్, గౌతమి నాయక్, రీచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, నడినే డీ క్లెర్క్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: