WPL 2026: గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ

Read Time:  1 min
WPL 2026: గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ
FONT SIZE
GET APP

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) సీజన్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. నవీ ముంబైలోని ప్రముఖ డీవై పాటిల్ స్టేడియం వేదికగా సాగుతున్న ఈ ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ జట్టు కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో గుజరాత్ జెయింట్స్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ యూపీ వారియర్జ్‌పై గెలిచి శుభారంభం చేయగా,

Read also: Telangana: నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ..

జెమీమా మాట్లాడుతూ..

ఢిల్లీ క్యాపిటల్స్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. టాస్ గెలిచిన అనంతరం జెమీమా మాట్లాడుతూ, ఇది ఛేజింగ్‌కు అనుకూలించే మైదానమని, మంచు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉండటంతోనే ఫీల్డింగ్ ఎంచుకున్నానని వివరించింది. వరుస మ్యాచ్‌ల వల్ల ఓటమిపై ఎక్కువగా ఆలోచించే అవకాశం రాలేదని ఆమె తెలిపింది. మరోవైపు, గుజరాత్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ మాట్లాడుతూ..

 WPL 2026: In the match against Gujarat Giants, Delhi won the toss
WPL 2026: In the match against Gujarat Giants, Delhi won the toss

తొలి మ్యాచ్ నుంచి తాము చాలా పాఠాలు నేర్చుకున్నామని చెప్పింది. తొలి మ్యాచ్‌లో 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన యువ క్రీడాకారిణి అనుష్క శర్మను ఆమె ప్రశంసించింది. డబ్ల్యూపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లు వెంటనే రాణించడం గొప్ప విషయమని గార్డనర్ పేర్కొంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.