మహిళల ప్రీమియర్ లీగ్ WPL-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక పోరులో గుజరాత్ జెయింట్స్ అద్భుతమైన విజయం సాధించింది.ఆదివారం ముంబై వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్.. 210 పరుగుల రికార్డు ఛేదనలో గెలుపునకు చేరువగా వచ్చినా 4 పరుగుల తేడాతో పరాభవం పాలై టోర్నీలో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.భారీ స్కోర్లు నమోదైన పోరులో జెయింట్స్ నిర్దేశించిన 210 పరుగుల ఛేదనలో క్యాపిటల్స్.. 20 ఓవర్లలో 205/5 వద్దే ఆగిపోయింది.
Read also: Rohit Sharma: వన్డేల్లో చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్
క్యాపిటల్స్ ఆశలపై నీళ్లు
లిజెల్లె లీ (54 బంతుల్లో 86, 12 ఫోర్లు, 3 సిక్సర్లు), లారా వోల్వార్ట్ (38 బంతుల్లో 77, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 7 పరుగులు అవసరమవగా.. క్రీజులో వోల్వార్ట్, జెమీమా (15) క్రీజులో ఉన్నా డివైన్ 2 పరుగులే ఇచ్చి ఆ ఇద్దరినీ ఔట్ చేసి క్యాపిటల్స్ ఆశలపై నీళ్లు చల్లింది.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన జెయింట్స్ తరఫున ఓపెనర్ సోఫీ డివైన్ (42 బంతుల్లో 95, 7 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఆష్లీ గార్డ్‌నర్ (26 బంతుల్లో 49, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర ఆటతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 209 రన్స్‌కు ఆలౌట్ అయింది.డబ్ల్యూపీఎల్ కెరీర్‌లో రెండో మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ బౌలర్ నందిని శర్మ (5/33) హ్యాట్రిక్ నమోదుచేయడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 209 (డివైన్ 95, గార్డ్‌నర్ 49, నందిని 5/33, చరణి 2/42);
ఢిల్లీ: 20 ఓవర్లలో 205/5 (లీ 86, వోల్వార్ట్ 77, డివైన్ 2/21, రాజేశ్వరి 2/34)
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: