📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

world Test Championship : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం

Author Icon By Digital
Updated: May 7, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

world Test Championship వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ సారి తుది పోరు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. గత సీజన్‌లో టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా మరోసారి కప్‌ను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని ఎగరేసే ప్రయత్నాల్లో ఉంది.ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ముందస్తు సన్నాహాలపై దృష్టి పెట్టింది. ఫైనల్‌కు ముందు జింబాబ్వేతో నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది.

world Test Championship : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం

ఈ మ్యాచ్ ఈ నెలాఖరులో జరగనుంది. అంతేకాదు, జూన్ 3న కూడా మరో ప్రాక్టీస్ మ్యాచ్‌ ప్రొటీస్ జట్టు ఆడనుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు సభ్యులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటున్నారు. గ్రూప్ స్టేజి ముగిసిన తర్వాత కొంతమంది ఆటగాళ్లు నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. మిగిలిన వారు మే 25న ఐపీఎల్ పూర్తయ్యాక జట్టుతో చేరతారు.ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడపై ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) విధించిన తాత్కాలిక నిషేధాన్ని తొలగించింది. తొలుత రబాడ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరమవుతాడన్న వార్తలు వచ్చినప్పటికీ, నిషేధం ఎత్తివేతతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఊరట లభించింది. ఇప్పుడు అతడు ఫైనల్‌కు అందుబాటులో ఉండనున్నాడు.

Read More : IPL 2025 : యువ ఆటగాళ్ల సెంచరీలు చేతిచెదిరాయి

Australia vs South Africa Test Final South Africa cricket team news South Africa vs Australia Test World Test Championship 2025 WTC Final 2025 WTC Final countdown

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.