ప్రపంచ చదరంగంలో కొత్త సంచలనమైన సంఘటన చోటు చేసుకుంది. దోహాలో జరుగుతున్న FIDE వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత యువ గ్రాండ్‌మాస్టర్, (World Blitz Championship) ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ ఓ ఆశ్చర్యకరమైన ఓటమికి గురయ్యారు. కేవలం 12 ఏళ్ల వయసున్న రష్యా(Russia) యువ సంచలనం సెర్గీ స్లోకిన్ చేతిలో గుకేశ్ ఓటమి పాలవ్వడం క్రీడాకారులను విస్మయానికి గురిచేసింది. మూడో రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి నిమిషంలో జరిగిన ఒక తప్పిదే గేమ్ ఫలితాన్ని మార్చింది. నల్ల పావులతో ఆడుతున్న గుకేశ్‌కు గేమ్ 70వ ఎత్తు వద్ద తీవ్రమైన సమయ ఒత్తిడి ఏర్పడింది. చేతిలో కేవలం 8 సెకన్ల సమయం మాత్రమే ఉంది. ఈ దశలో ప్రత్యర్థి స్లోకిన్ డ్రా చేసుకునే ఉద్దేశంతో రూక్ ఎక్స్చేంజ్ (ఏనుగుల మార్పిడి) ఆఫర్ చేశాడు. సాధారణంగా అది డ్రా అయ్యే గేమ్. కానీ, దూకుడుగా ఆడుతూ ఎప్పుడూ గెలుపునే కోరుకునే గుకేశ్, ఆ డ్రా ఆఫర్‌ను తిరస్కరించి తన రూక్‌ను ‘f4’కి జరిపాడు.
Read Also: VHT: విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ మరో మ్యాచ్ కన్ఫర్మ్
గెలుపు కోసం తీసుకున్న రిస్క్
ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ మారిస్ యాష్లే ఈ గేమ్ గురించి మాట్లాడుతూ, గుకేశ్ పోరాటం నిజంగా గొప్పది. (World Blitz Championship) అయితే ఈ సారి గెలుపు కోసం తీసుకున్న రిస్క్ ఎక్కువ అయింది. అక్కడ డ్రా చేసుకోవడం సరైన నిర్ణయం. ప్రపంచ ఛాంపియన్‌గా ఇలాంటి ఫలితం చూడడం ఆశ్చర్యకరం అన్నారు. టోర్నీ ముందు గుకేశ్ తనకు క్లాసికల్ ఫార్మాట్ ప్రధానమని, కానీ ఇటీవల ర్యాపిడ్ బ్లిట్జ్ ఫార్మాట్లపై కూడా దృష్టి పెట్టానని చెప్పారు. రేటింగ్ ప్రకారం గుకేశ్ (2628) ముందు ఉన్నప్పటికీ, బ్లిట్జ్‌లో క్షణాల్లో తీసుకునే నిర్ణయాలు ఫలితాన్ని పూర్తిగా మార్చగలవని ఈ మ్యాచ్ చూపించింది. గుకేశ్‌కు ఇది ఒక చిన్న మచ్చగా మిగిలింది, కానీ 12 ఏళ్ల స్లోకిన్‌కు ఇది తన కెరీర్‌లో మలుపు తిప్పే విజయంగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: