📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Women’s World Cup Final 2025: టాస్ ఓడిన టీమిండియా

Author Icon By Aanusha
Updated: November 2, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 (Women’s World Cup Final 2025) ఫైనల్న లో, ముంబైలోని ప్రసిద్ధ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.

Read Also: India vs Australia: టీ20 సిరీస్‌.. టాస్ గెలిచిన టీమిండియా

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. దీంతో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Captain Harmanpreet Kaur) సారథ్యంలోని టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.

‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ వచ్చే అవకాశం ఉంది. వర్షం పడటం వల్ల పిచ్ తడిగా మారి బౌలింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నాం. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నాం.

టైటిల్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో ఇరు జట్లు పటిష్టమైన

భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాం. ఈ మ్యాచ్‌పై చాలా నమ్మకంతో బరిలోకి దిగుతున్నాం.’అని లారా వోల్వార్డ్ట్ చెప్పుకొచ్చింది.ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో ఇరు జట్లు పటిష్టమైన వ్యూహాలతో బరిలోకి దిగాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది.

Women’s World Cup Final 2025

స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని దక్షిణాఫ్రికా జట్టు ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

తుది జట్లు

భారత మహిళల జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.

దక్షిణాఫ్రికా మహిళల జట్టు: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బోష్, సునే లూస్, మరిజానే కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), అన్నెరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నడిన్ డి క్లర్క్, అయాబొంగా ఖాకా, నాన్‌కులెలెకో మ్లాబా.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

ICC Women’s World Cup 2025 India vs South Africa latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.