हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Women’s World Cup: దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

Aanusha
Latest News: Women’s World Cup: దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

మహిళల వన్డే ప్రపంచకప్‌ (Women’s ODI World Cup 2025) లో సెమీ ఫైనల్స్ సమీకరణాలు చివరకు పూర్తిగా స్పష్టమయ్యాయి. శనివారం ఇండోర్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో చెత్త ప్రదర్శన చేసి ఘోర పరాజయం పొందడంతో,సెమీస్‌లో టీమిండియా ఎవరితో తలపడనుందో తేలిపోయింది..

BCCI: ఆసీస్ మహిళా జట్టును క్షమాపణలు కోరిన బీసీసీఐ

ఈ ఓటమితో పాటు పాయింట్ల సమీకరణలు, నెట్ రన్‌రేట్ లెక్కల ఆధారంగా, భారత్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కోనున్నట్లు తేలింది. భారత్–ఆస్ట్రేలియా సెమీస్ పోరు అక్టోబర్ 30న జరగనుంది. ఇది రెండు జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగానూ, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుగా మారింది.

ఇందోర్‌లో జరిగిన నేటి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ అలానా కింగ్ (7/18) తన స్పిన్‌తో మాయ చేసింది. ఆమె ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. కేవలం 24 ఓవర్లలో 97 పరుగులకే సఫారీ జట్టు ఆలౌట్ అయింది. లారా వోల్వార్డ్ట్ (31), సినాలో జాఫ్తా (29), నాడిన్ డిక్లర్క్ (14) మినహా మరే బ్యాటర్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

Women's World Cup
Women’s World Cup

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా

98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సులువుగానే విజయాన్ని అందుకుంది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (5), ఎలిస్ పెర్రీ (0) త్వరగా ఔటైనప్పటికీ, జార్జియా వాల్ (38*), బెత్ మూనీ (42) బాధ్యతగా ఆడి జట్టును గెలిపించారు.

16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 7 మ్యాచ్‌లలో 6 విజయాలు, 13 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (13), దక్షిణాఫ్రికా (10), ఇంగ్లాండ్ (9), భారత్ (6) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ గెలిచినా 8 పాయింట్లతో నాలుగో స్థానంలోనే ఉంటుంది.

దీంతో నిబంధనల ప్రకారం, ఒకటో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో, నాలుగో స్థానంలో ఉన్న భారత్ సెమీస్‌లో తలపడటం ఖాయమైంది. ప్రపంచ ఛాంపియన్ అయిన ఆసీస్‌తో సెమీస్ పోరు భారత్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి కీలక ప్లేయర్లు రాణించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870