हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News:  Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్

Aanusha
Latest News:  Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్

భారత మహిళా క్రికెట్ (Women’s World Cup 2025) జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు మరో అడుగు మాత్రమే దూరంలో ఉంది. నవీ ముంబై వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్‌ సేన అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరులో అడుగుపెట్టింది. ఈ విజయంతో భారత్‌ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Read Also: India vs Australia: మహిళల ప్రపంచ కప్‌..టాస్ ఓడిన భారత్

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు మొదటి ఓవర్ నుంచే దూకుడుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి టాప్‌ ఆర్డర్‌ను చిత్తు చేశారు. రెనుకా సింగ్, పూజా వస్త్రాకర్‌లు సమర్థవంతంగా బౌలింగ్ చేస్తూ కీలక వికెట్లు తీయగా, ఆస్ట్రేలియా బ్యాటర్లు పెద్ద స్కోరు చేయలేకపోయారు. మెగ్ లానింగ్ (45) ఒక్కరే కొంత ప్రతిఘటన చూపినా, ఇతరులు విఫలమయ్యారు. ఫలితంగా ఆసీస్ జట్టు 48 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది.

జెమీమా ఇచ్చిన మూడు సునాయస క్యాచ్‌

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లకు 341 పరుగులు చేసి గెలుపొందింది. జెమీమా రోడ్రిగ్స్(134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. హర్మన్‌ప్రీత్ కౌర్(88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది.

ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్(2/46), అన్నబెల్ సదర్లాండ్(2/69) రెండేసి వికెట్లు తీసారు.చెత్త ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియా విజయాన్ని చేజార్చుకుంది. జెమీమా ఇచ్చిన మూడు సునాయస క్యాచ్‌లను నేలపాలు చేసి మూల్యం చెల్లించుకుంది.

Women's World Cup 2025
Women’s World Cup 2025

ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్లో

ఈ గెలుపుతో టీమిండియా చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌ (Women’s World Cup 2025) లోనే అత్యధిక పరుగులు చేధించిన జట్టుగా నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు.

ప్రతికా రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ(10)తీవ్రంగా నిరాశపర్చింది. రెండు బౌండరీలతో జోరు కనబర్చిన షెఫాలీ వర్మ‌ను కిమ్ గర్త్ ఎల్బీగా పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి జెమీమా రాగా.. స్మృతి మంధాన ఓ భారీ సిక్సర్‌తో దూకుడు కనబర్చింది. కానీ మంధానను కూడా కిమ్ గార్త్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చింది.

వ్యక్తిగత స్కోర్

అంపైర్ నాటౌటివ్వగా.. రివ్యూతో ఆసీస్ ఫలితం రాబట్టింది. దాంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లకు 60 పరుగులే చేసింది.కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి జెమీమా చెలరేగింది. జెమీమా దూకుడుగా ఆడగా.. క్రీజులో సెట్ అయ్యేందుకు హర్మన్‌ప్రీత్ టైమ్ తీసుకుంది. 57 బంతుల్లో జెమీమా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా బ్యాట్ ఝులిపించింది.

బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం హర్మన్‌ మరింత దూకుడుగా ఆడింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడింది.82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అలనా కింగ్ బౌలింగ్‌లో జెమీమా ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ అలీసా హీలీ నేలపాలు చేసింది.

దీప్తి శర్మ దూకుడు

ఈ అవకాశంతో జెమీమా చెలరేగింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం వేగంగా పరుగులు రాబట్టింది. సెంచరీ దిశగా సాగిన ఆమెను సదర్లాండ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 167 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ కూడా దూకుడు ఆడింది.

మూడు బౌండరీలతో జోరు కనబర్చింది. కానీ జెమీమా తప్పిదం కారణంగా ఆమె రనౌట్‌గా వెనుదిరిగింది. దాంతో క్రీజులోకి రిచా ఘోష్ రాగా.. జెమీమా తన క్లాస్ బ్యాటింగ్ కొనసాగించింది. మేఘన్ స్కట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 115 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. కానీ జెమీమా ఎలాంటి సంబరాలు చేసుకోలేదు.

రిచా ఘోష్ భారీ సిక్సర్‌

కనీసం బ్యాట్ కూడా ఎత్తలేదు. జట్టు విజయమే తన ముఖ్యమని భావించింది.106 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సదర్లాండ్ బౌలింగ్‌లో జెమీమా ఇచ్చిన మరో సునాయస క్యాచ్‌ను మెక్‌గ్రాత్ నేలపాలు చేసింది. రిచా ఘోష్ భారీ సిక్సర్‌తో దూకుడు కనబర్చింది.

కానీ అనవసర షాట్‌తో వికెట్ పారేసుకుంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. అమన్ జోత్‌తో కలిసి జెమీమా విజయం కోసం పోరాడింది. చివర్లో అమన్ జోత్ కౌర్ రెండు బౌండరీలు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870