हिन्दी | Epaper
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Latest News: Women’s Cricket: మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ

Anusha
Latest News: Women’s Cricket: మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ

మహిళల క్రికెట్ (Women’s Cricket) వేగంగా ఆదరణ పొందుతూ, అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఈ క్రమంలో, ప్రస్తుత వన్డే ప్రపంచకప్ 2025లో భారత్, పాకిస్థాన్ మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుండి అపూర్వ స్పందన లభించడం విశేషం.

Read Also: ICC award: స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు

తాజాగా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC),జియో హాట్‌స్టార్ (Jio Hotstar) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ మ్యాచ్‌ను మొత్తం 2.84 కోట్ల మంది వీక్షించారు. వ్యూయర్‌షిప్ పరంగా ఇది మహిళల క్రికెట్ చరిత్రలో రికార్డు స్థాయి. వాచ్‌టైమ్ పరంగా చూస్తే, ఈ మ్యాచ్ 187 కోట్ల నిమిషాల పాటు వీక్షించబడినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ప్రస్తుత ప్రపంచకప్‌లో (Women’s Cricket) తొలి 13 మ్యాచులను సుమారు 6 కోట్ల మంది చూడగా, మొత్తం వీక్షణ సమయం 700 కోట్ల నిమిషాలు దాటింది. గత ప్రపంచకప్‌ (World Cup) తో పోలిస్తే వాచ్‌టైమ్ ఏకంగా 12 రెట్లు పెరగడం మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

Women's Cricket
Women’s Cricket

క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్‌తోనే కాకుండా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. ఈ మ్యాచ్‌ను దాదాపు 48 లక్షల మంది వీక్షించారు.లీగ్ దశలో టీమిండియా ఇంకా ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో కీలకమైన మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సెమీ ఫైనల్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లలో గెలవడం భారత్‌కు చాలా ముఖ్యం.

ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచులకు వ్యూయర్‌షిప్‌ మరింత పెరిగి మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓటమి పాలైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870