మహిళల ప్రపంచకప్ (WWC) లో చరిత్ర సృష్టించిన భారత్ మహిళా క్రికెట్ జట్టు నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) ను కలిసింది. తమ అద్భుత ప్రదర్శనతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ జట్టు విజయాన్ని రాష్ట్రపతి (President Draupadi Murmu) అభినందించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో జట్టు సభ్యులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ పాల్గొన్నారు.
Read Also: IND vs AUS: భారీ సిక్సర్‌తో ఆకట్టుకున్న శివం దూబే
రాష్ట్రపతితో ఆటగాళ్లు తమ అనుభవాలను పంచుకున్నారు. టోర్నమెంట్ సమయంలో ఎదురైన సవాళ్లు, ముఖ్యమైన క్షణాలు, విజయానందం గురించి వివరించారు.స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ వంటి క్రీడాకారిణిలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
రాష్ట్రపతి (President Draupadi Murmu).. భవిష్యత్తు తరాలకు రోల్ మోడల్ గా నిలిచారని కొనియాడారు. విభిన్న ప్రాంతాలు, సామాజిక నేపథ్యాలు, ప్రత్యేక పరిస్థితుల నుంచి వచ్చిన ప్లేయర్లంతా ఇండియాను ప్రతిబింబించారని ముర్ము ప్రశంసించారు. కాగా భారత జట్టు నిన్న PM మోదీని కలిసిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: