గత కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న షమీపై బీసీసీఐ సెలెక్టర్లు కీలక యూ-టర్న్ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఫిట్‌నెస్, ఫామ్, భవిష్యత్తుపై అనుమానాల మధ్య ఉన్న 35 ఏళ్ల షమీ పేరు మళ్లీ సెలెక్షన్ చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని అతడి రీఎంట్రీపై గంభీరంగా ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Deepti Sharma: టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్
దేశవాళీలో అతని ప్రదర్శన బాగుంది
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి షమీ ఎంపికపై స్పష్టతనిచ్చారు. “షమీ గురించి సెలెక్షన్ కమిటీ రెగ్యులర్‌గా చర్చిస్తోంది. అతడు రేసు నుంచి తప్పుకోలేదు. కేవలం ఫిట్‌నెస్ మాత్రమే ఆందోళన కలిగించే అంశం. షమీ స్థాయి బౌలర్ వికెట్లు తీయగలడని అందరికీ తెలుసు. దేశవాళీలో అతని ప్రదర్శన బాగుంది. అనుభవం, వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న అతడిని న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు” అని ఆ వర్గాలు తెలిపాయి.
షమీ చివరిసారిగా 2025 మార్చిలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడాడు. ఆ టోర్నీలో 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత మోకాలి, చీలమండ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ, సుదీర్ఘ రీహ్యాబిలిటేషన్ తర్వాత ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో షమీ అదరగొడుతున్నాడు. రంజీ ట్రోఫీలో కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 20 వికెట్లు పడగొట్టడం అతని ఫామ్‌కు నిదర్శనం. అలాగే విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లోనూ కలిపి 17 వికెట్లు తీశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: