हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Virat Kohli: వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతా: కోహ్లీ

Anusha
Latest News: Virat Kohli: వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతా: కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. ఇకపై తాను కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తాడంటూ,సోషల్ మీడియాలో, వస్తున్న వార్తలను తోసిపుచ్చాడు. పలు కీలక విషయాలపై పరోక్షంగా సమాధానాలిచ్చాడు.

Read Also: CM Revanth: ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసిన సీఎం రేవంత్

మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు

సౌతాఫ్రికాతో రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీ అద్భుత శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కోహ్లీ.. మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కష్టమైన సాధనను తాను నమ్మనని, మానసికంగా బలంగా ఉండటంపైనే దృష్టిపెడుతానని తెలిపాడు.

మానసికంగా ఆడగలనని అనిపించినంత కాలం ఆటలో కొనసాగుతానని కోహ్లీ స్పష్టం చేశాడు.ఏ రోజు అయితే తాను ఆడలేనని అనుకుంటానో.. ఆ క్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తానని పరోక్షంగా వెల్లడించాడు.నేను జట్టు కోసం 120 శాతం శ్రమిస్తాను. రాంచీ పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికే ముందుగా వచ్చాను. పగటి పూట రెండు సెషన్లు, సాయంత్రం ఒక సెషన్ నెట్స్‌లో బ్యాటింగ్ చేశాను.

 Will play only ODI format: Kohli
Will play only ODI format: Kohli

రికవరీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి

ఇప్పటికీ ప్రతీ మ్యాచ్‌కు ముందు రోజు.. ఆటకు సంబంధించి నా మదిలోనే విజువలైజ్ చేసుకుంటా. అందులోకి బౌలర్లు, ఫీల్డర్లు అందరూ వస్తారు. బౌలర్లు, ఫీల్డర్లను లక్ష్యంగా చేసుకొని నేను ఆడే తీరును ఊహించుకుంటా. అప్పుడే నేను మంచి స్థితిలో ఉన్నానని భావిస్తాను. అప్పుడే కాస్త రిలాక్స్ అయి ఆడగలను.

300కి పైగా వన్డేలు ఆడిన అనుభవం తనకు ఉందని, ఫామ్‌లో ఉన్నంత కాలం నెట్స్‌లో గంటన్నర సాధన చేస్తే సరిపోతుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ‘‘నాకు ఇప్పుడు 37 ఏళ్లు. కాబట్టి ఆట తర్వాత రికవరీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని తన వయసును గుర్తుచేసుకున్నాడు. తాను ఆడే ప్రతి గేమ్‌ను 120 శాతం ఆస్వాదిస్తూ ఆడతానని, అదే తన విజయ రహస్యమని కోహ్లీ (Virat Kohli) వెల్లడించాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870