WI vs SA: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ పోరాడదగ్గ స్కోరు సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ,
Read Also: IND vs ZIM: క్రికెట్ అభిమానులకు బంపర్ ఆఫర్.. టికెట్ ఉంటే మెట్రో ప్రయాణం ఫ్రీ!
షెఫర్డ్ హాఫ్ సెంచరీ.. హోల్డర్ మెరుపులు
దక్షిణాఫ్రికా బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా రాణించారు. లుంగి ఎంగిడి 30 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టగా, కగిసో రబాడ పొదుపుగా బౌలింగ్ చేసి 22 పరుగులకే 2 వికెట్లు తీశాడు. కార్బిన్ బాష్ కూడా రెండు వికెట్లతో రాణించాడు. వీరి ధాటికి వెస్టిండీస్ ఒక దశలో 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ (31 బంతుల్లో 49), రొమారియో షెపర్డ్ (37 బంతుల్లో 52 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 89 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. ఈ కీలక మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే దక్షిణాఫ్రికా ఈ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: