Who is Saiteja Mukkamalla : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అమెరికా జట్టులో ఒక తెలుగు ఆటగాడు బరిలోకి దిగడం విశేషంగా మారింది. ఆంధ్ర మూలాలున్న యువ క్రికెటర్ సాయితేజ ముక్కామల అమెరికా తరఫున ఆడుతూ భారత అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పసికూనగా భావిస్తున్న అమెరికా జట్టుకు కీలక ఆటగాడిగా సాయితేజ నిలుస్తుండడం ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఆంధ్ర నుంచి అమెరికా వరకు స్ఫూర్తిదాయక ప్రయాణం
2004లో న్యూజెర్సీలో జన్మించిన సాయితేజ ముక్కామల తండ్రి నాగేశ్వర్ రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న సాయితేజ, 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ గెలుపును చూసిన తర్వాత ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నాడు. కొడుకులోని ప్రతిభను గుర్తించిన తండ్రి 2018లో అమెరికాలోని తన ఉన్నత ఉద్యోగాన్ని వదిలి, జీతంలో భారీ కోతను భరిస్తూ హైదరాబాద్‌కు మారారు. ఇక్కడ వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందడం సాయితేజ కెరీర్‌ను మలుపుతిప్పింది.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం
గణాంకాలే చెబుతున్నాయి సాయితేజ సత్తా
సాయితేజ కేవలం ప్రవాస కోటాలో జట్టులోకి రాలేదు. తన ప్రతిభతోనే అమెరికా జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు టీ20ల్లో 18 ఇన్నింగ్స్‌ల్లో 63కి పైగా సగటు, 150కి పైగా స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలతో దూకుడైన బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024లో కెనడాపై తొలి టీ20 మ్యాచ్‌లోనే అర్ధశతకం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వన్డేల్లో కూడా రెండు సెంచరీలు సాధించి అమెరికా తరఫున పిన్న వయసులోనే శతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
గెలవడానికే వచ్చాం
“మా జట్టు కేవలం పాల్గొనడానికి రాలేదు, గెలవడానికి వచ్చింది” అని సాయితేజ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో పెద్ద జట్లకు షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్న ఈ తెలుగు తేజం, న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ అర్ధశతకంతో ఫామ్ చాటాడు. ఇప్పుడు భారత బౌలర్లను ఎదుర్కొనే ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శనపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: