ప్రపంచంలోని అతిపెద్ద మహిళా క్రికెట్ లీగ్‌లలో ఒకటైన (WPL 2026) షెడ్యూల్ ప్రకటించారు.ఈ టోర్నమెంట్ రెండు నగరాల్లో జరుగుతుందని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. నవీ ముంబై, వడోదరలో మ్యచ్‌లు జరగనున్నాయి.
Read Also: Gautam Gambhir: గంభీర్‌కు సునీల్ గవాస్కర్ మద్దతు

జనవరి 9న ప్రారంభం
మహిళల ప్రీమియర్ లీగ్ (Women’s Premier League 2026) జనవరి 9న ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ ఫిబ్రవరి 5న జరగనుంది. మొదటి మ్యాచ్ నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. టైటిల్ పోరు వడోదరలోని BCA స్టేడియంలో జరుగుతుంది.
భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, మహిళల ప్రీమియర్ లీగ్ (Women’s Premier League 2026) మరింత ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నారు. గత మూడు సీజన్లలో ఈ టోర్నమెంట్ క్రమంగా ప్రజాదరణ పొందుతోంది. 2023లో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌ను గెలుచుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: