📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Karun Nair: టీమిండియా నిర్ణయంపై కరుణ్ నాయర్ ఏమన్నాడంటే?

Author Icon By Anusha
Updated: September 26, 2025 • 7:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ అభిమానులకు ఒక సడెన్ షాక్! వెస్టిండీస్‌తో సొంత గడ్డపై జరుగనున్న టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో వెటరన్ బ్యాట్స్మన్ కరుణ్ నాయర్‌ (Karun Nair) కు చోటు దొరకలేదు. భారత జట్టులో తిరిగి వెనుకబడిన కరుణ్, గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగు టెస్టుల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో ఫార్మ్ ప్రదర్శించడంతో అతనిపై వేటు పడింది.

Asia Cup 2025: భారత్‌ను ఓడించాలంటే అతన్ని ఔట్ చేయాలి: షోయబ్ అక్తర్

8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు టెస్ట్‌ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ (Half a century) నమోదు చేశాడు. దాంతో అతనిపై వేటు పడింది. తాజాగా తన వేటుపై స్పందించిన కరుణ్ నాయర్ నిరాశ వ్యక్తం చేశాడు. తనను ఎందుకు తప్పించారో తెలియదని, సెలెక్టర్లనే అడగాలని తెలిపాడు.

నా వంతు సహాయ సహకారాన్ని అందించాను

‘నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. మాటలు రావడం లేదు. దీని గురించి మీరు సెలెక్టర్లనే అడగాలి. ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌లో నేను 50 పరుగులు చేశాను. తొలి ఇన్నింగ్స్‌ (innings)లో నేనే టాప్ స్కోరర్‌గా నిలిచాను. జట్టుకు నా వంతు సహాయ సహకారాన్ని అందించాను. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో మేం విజయం సాధించాం. కానీ సెలెక్టర్లు ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

నాకు జట్టులో స్థానం ఉంటుందని భావించాను.ప్రస్తుతానికి నేను చేయగలిగేది కూడా ఏమీ లేదు. నేను మరింత కష్టపడాలి. నా కెరీర్ గురించి నేను చాలా క్లారిటీతో ఉన్నాను. నా సాయశక్తులా ప్రయత్నించాను. కానీ సెలెక్టర్లు (selectors) నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాన్ని గౌరవించాలి. ఇప్పుడు నేను రంజీ ట్రోఫీ కోసం సిద్దమవుతున్నాను.’అని కరుణ్ నాయర్ చెప్పుకొచ్చాడు.

Karun Nair

పడిక్కల్ కాస్త మెరుగైన ప్రదర్శన ఇవ్వగలడని

ఇంగ్లండ్ పర్యటనలో తాము ఆశించిన రీతిలో రాణించకపోవడంతోనే కరుణ్ నాయర్‌పై వేటు వేసామని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) వివరణ ఇచ్చాడు. జట్టు ప్రకటన అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చాడు. ‘ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ నుంచి మేం మరింత నిలకడైన ప్రదర్శనను ఆశించాం.

ఒక్క ఇన్నింగ్స్ గురించి మాట్లాడటం సరికాదు. ప్రస్తుతం సమయంలో పడిక్కల్ కాస్త మెరుగైన ప్రదర్శన ఇవ్వగలడని మేం భావిస్తున్నాం. మేం అందరికీ 15-20 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వలేం.’అని గవాస్కర్ సమాధానమిచ్చాడు. అక్టోబర్ 2 నుంచి అహ్మాదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్,కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Cricket News India Test Team Indian Cricket Krunal Nair latest news player reaction Team Selection Telugu News Test Cricket veteran batsman West Indies Test Series

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.