Romario Shepherd hat-trick : ఒకే ఓవర్లో 4 వికెట్లు, షెపర్డ్ షోతో విండీస్ విజయం

Read Time:  1 min
Romario Shepherd hat-trick
Romario Shepherd hat-trick
FONT SIZE
GET APP

Romario Shepherd hat-trick : టీ20 ప్రపంచకప్‌ 2026లో West Indies జట్టు అద్భుత విజయంతో టోర్నీని ప్రారంభించింది. స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ Romario Shepherd అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్‌ను ఒంటి చేత్తో తిప్పేశాడు. ఒకే ఓవర్లో హ్యాట్రిక్‌తో పాటు నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Eden Gardens, కోల్‌కతాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మేయర్ 36 బంతుల్లో 64 పరుగులతో (2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకం చేసి జట్టును భారీ స్కోర్‌కు చేర్చాడు. బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

Romario Shepherd hat-trick
Romario Shepherd hat-trick

183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన Scotland ను షెపర్డ్ బౌలింగ్‌తో కకావికలం చేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అదే ఓవర్లో మరో వికెట్ కూడా పడగొట్టి ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన అరుదైన ఘనత సాధించాడు. మొత్తం 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.

రిచీ బెరింగ్టన్, టామ్ బ్రూస్ కొంత ప్రతిఘటన చూపించినప్పటికీ, షెపర్డ్‌తో పాటు జాసన్ హోల్డర్ దెబ్బకు స్కాట్లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో గ్రూప్-సిలో వెస్టిండీస్ కీలక రెండు పాయింట్లు సాధించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.