📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

West Indies Cricket: క్రికెట్‌లో ఫిక్సింగ్.. పలువురిపై ఐసీసీ వేటు!

Author Icon By Anusha
Updated: March 12, 2026 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

West Indies Cricket: అంతర్జాతీయ క్రికెట్‌లో అవినీతిని ఏమాత్రం సహించబోమని ఐసీసీ (ICC) మరోసారి స్పష్టం చేసింది. క్రికెట్ వెస్టిండీస్ (CWI) నియమావళిని ఉల్లంఘించినట్లు తేలడంతో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జావాన్ సియర్లెస్, టైటాన్స్ జట్టు యజమాని చిత్రరంజన్ రాథోడ్, జట్టు అధికారి గ్రిఫిత్‌లపై ఐసీసీ అభియోగాలు మోపింది. వీరిని తక్షణమే అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది..

Read Also: Lionel Messi: 900వ గోల్‌కు అడుగు దూరంలో మెస్సీ

బిమ్10 టోర్నమెంట్‌లో అక్రమాలు

2023-24లో జరిగిన బిమ్10 టోర్నమెంట్‌లో ఈ ముగ్గురూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ టోర్నమెంట్ క్రికెట్ వెస్టిండీస్ (CWI) యాంటీ కరప్షన్ కోడ్ పరిధిలోకి వస్తుంది. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేయడం (ఫిక్సింగ్), అవినీతి కార్యకలాపాలకు ఇతరులను ప్రోత్సహించడం, విచారణకు సహకరించకపోవడం వంటి పలు అభియోగాలను వీరిపై మోపారు. రాథోడ్‌పై మూడు, సియర్లెస్‌పై నాలుగు, గ్రిఫిత్‌పై నాలుగు అభియోగాలను సీడ‌బ్ల్యూఐ కోడ్ కింద నమోదు చేశారు.

West Indies Cricket: Fixing in cricket.. ICC bans several people!

వీటికి అదనంగా జట్టు అధికారి గ్రిఫిత్‌పై ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ కింద మరో అభియోగం కూడా ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించిన విచారణలో సాక్ష్యాలను తారుమారు చేయడం ద్వారా విచారణకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ అభియోగాలపై స్పందించేందుకు నిన్న‌టి నుంచి 14 రోజుల గడువు ఇచ్చారు.జావాన్ సియర్లెస్ గతంలో వెస్టిండీస్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్‌)లో ఆడాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. తాజా ఆరోపణలతో అతని కెరీర్ ప్రమాదంలో పడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BIM10 Tournament ICC Anti-Corruption Code Javon Searles Match Fixing West Indies Cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.